Home /News /national /

Mi-17V5 Helicopter: బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం.. ఈ Mi-17V5 హెలికాప్టర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

Mi-17V5 Helicopter: బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం.. ఈ Mi-17V5 హెలికాప్టర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

బిపిన్ రావత్ ప్రయాణించిన Mi-17V5 Helicopter విశేషాలు తెలుసా?

బిపిన్ రావత్ ప్రయాణించిన Mi-17V5 Helicopter విశేషాలు తెలుసా?

Mi-17V5 Helicopter: బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బంది ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ హెలికాప్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff)  బిపిన్ రావత్‌ (Bipin Rawat) ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air force) హెలీకాఫ్టర్ (Chopper)  తమిళనాడులోని కూనూర్ (Kunoor) సమీపంలో క్రాష్ అయింది. రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బంది ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. అనంతరం భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్యపై ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ బృందం ప్రయాణిస్తున్న ఈ హెలికాప్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Mi-17V5 హెలికాప్టర్.. రష్యాలో తయారైన Mi-8 హెలికాప్టర్‌ల మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ వెర్షన్. అవసరమైనప్పుడు దళాలను మోహరించడం, ఆయుధ రవాణా, అగ్నిమాపక సేవలు, పెట్రోలింగ్, సెర్చ్, రెస్క్యూ మిషన్‌లకు Mi-17V5 హెలికాప్టర్‌ను ఉపయోగిస్తారు. మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్లలో ఈ మోడల్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన సైనిక రవాణా హెలికాప్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

Tamilnadu helicopter crash: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి.. అందులో ఉన్న వారి వివరాలు ఇవే




- ఈ హెలికాప్టర్ల కోసం మన దేశం రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్‌పోర్ట్ (Rosoboronexport) అనే రష్యన్ డిఫెన్స్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత ప్రభుత్వానికి మొత్తం 80 Mi-17V5 హెలికాప్టర్‌లను పంపిణీ చేసేందుకు 2008లో ఒప్పందం కుదిరింది. వీటి డెలివరీ ప్రక్రియ 2013లో పూర్తయింది. భారత వైమానిక దళం కోసం మరో 71 Mi-17V5 హెలికాప్టర్ల డెలివరీకి కొత్త ఒప్పందాలు సైతం కుదిరాయి.

Tamilnadu: తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. చాపర్‌లో CDS బిపిన్ రావత్ ఫ్యామిలీ




- Mi-17V5 మీడియం-లిఫ్టర్ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఎగరగలదు. ఉష్ణమండల ప్రాంతాలు, సముద్ర వాతావరణాల్లో, ఎడారి పరిస్థితుల్లో కూడా ఇది సమర్థంగా ఎగురుతుంది.

- ఈ హెలికాప్టర్‌లో స్టార్‌బోర్డ్ స్లైడింగ్ డోర్, పారాచూట్ ఎక్విప్‌మెంట్లు, సెర్చ్‌లైట్, ఎమర్జెన్సీ ఫ్లోటేషన్ సిస్టమ్ వంటి భద్రత వ్యవస్థలు ఉన్నాయి.

- Mi-17V5 హెలికాప్టర్ గరిష్ట టేకాఫ్ బరువు 13,000 కిలోలుగా ఉంటుంది. ఇది 36 మంది సాయుధ సైనికులను రవాణా చేయగలదు. ఈ హెలికాప్టర్‌లో ఒక గ్లాస్ కాక్‌పిట్‌ ఉంటుంది. మల్టీ-ఫంక్షన్ డిస్‌ప్లేలు, నైట్ విజన్ ఎక్విప్‌మెంట్, ఆన్‌బోర్డ్ వెదర్ రాడార్, ఆటోపైలట్ సిస్టమ్‌ వంటివి దీంట్లో అమర్చి ఉంటాయి.

ఏ సంస్థ అయినా ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించకూడదు : రమేష్ తొలగింపు కేసులో హైకోర్టు సంచలన తీర్పు




- ఈ హెలికాప్టర్ Shturm-V క్షిపణులు, S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్, PKT మెషిన్ గన్స్, AKM సబ్‌మెరైన్ గన్స్.. వంటి ఆయుధాలను కలిగి ఉంది. ఈ ఆన్‌బోర్డ్‌ ఆయుధాలు శత్రు సిబ్బంది, సాయుధ వాహనాలు, భూ-ఆధారిత లక్ష్యాలు, ఇతర లక్ష్యాలను ఛేదించగలవు.

- హెలికాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన భాగాలకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంకును పేలుళ్ల నుంచి రక్షించడానికి పాలియురేతేన్‌ ఫోమ్‌తో నింపుతారు.

Tinder : వామ్మో! వీడియో డేటింగ్స్‌లో Hyderabad టాప్ -ఫోన్‌లోనే అన్నీ కానిచ్చేస్తున్నారు..


- ఇంజిన్-ఎగ్జాస్ట్ ఇన్‌ఫ్రారెడ్ సప్రెసర్స్, ఫ్లేర్స్ డిస్పెన్సర్, జామర్‌లను కూడా వీటిలో అమర్చి ఉంచుతారు.

- Mi-17V5 హెలికాప్టర్ గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ప్రామాణిక పరిధి 580 కిమీ. ఇది గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Army Chief General Bipin Rawa, Bipin Rawat, Helicopter, Helicopter Crash

తదుపరి వార్తలు