Home /News /national /

EVERYONE SHOULD KNOW ABOUT ROAD SAFETY WEEK SK

రోడ్డు భద్రతా వారం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వం ద్వారా రూపొందించిన నియమనిబంధనల గురించి ప్రజలకు చెప్పడానికి అనేక వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు మరియు మీటింగ్‌లు నిర్వహించబడతాయి. ఇది కేవలం ముందస్తు జాగ్రత్త చర్యలపైన మాత్రమే కాకుండా, బ్యానర్‌లు, కరపత్రాలు మరియు హ్యాండ్ అవుట్‌ల ద్వారా కూడా ప్రజానీకానికి అవగాహన కల్పిస్తుంది.

ఇంకా చదవండి ...
  భారతదేశంలో 2020, జనవరి 11 నుంచి జనవరి 17 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. మనం 31వ రోడ్డు భద్రతా వారం జరుపుకుంటున్నాం. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం వీధులను సురక్షితంగా ఉంచడం. భారతదేశపు రహదారులు పూర్తిగా ప్రమాద రహిత ప్రాంతాలుగా మార్చేందుకు ఈ కార్యక్రమం ద్వారా అనేక విధానాల్లో అవగాహన పెంపొందించబడుతుంది.

  రోడ్డు భద్రతా వారం ఎందుకు?


  2015లో, రోడ్డు ప్రమాదాల మరణాలు మరియు రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలని భారతదేశం వాగ్ధానం చేసింది. దానికి అనుగుణంగా బ్రెసిసీలికా డిక్లరేషన్‌పై సంతకం చేసింది. అయితే, ఐదు సంవత్సరాల తరువాత కూడా ఇది సాకారం కాలేదు. 2016లోని 1.50 లక్షల రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే 2017లో 1.47 లక్షల రోడ్డు ప్రమాదాలకు తగ్గినప్పటికీ, 2018లో ఇది 1.49 లక్షలకు పెరిగింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వశాఖ ద్వారా ప్రచురించబడ్డ చివరి నివేదికలో ఈ విషయాలు పొందుపరచబడ్డాయి. అందువల్ల, అవగాహన పెంపొందించడానికి రోడ్డు భద్రతా వారంలో అనేక కార్యక్రమాలు చేపట్టబడతాయి.

  రోడ్డు భద్రతా వారం సందర్భంగా ఏం జరుగుతుంది?

  భారతదేశంలో రోడ్డు భద్రతా వారం సమయంలో, రోడ్డు భద్రత కొరకు పనిచేసే పోలీస్ బలగాలు మరియు ఇతర డిపార్ట్‌మెంట్‌లు మోటార్ వెహికల్ చట్టం, 1988 మరియు మోటార్ వెహికల్స్ ( సవరణ) బిల్లు, 2019 గురించి అవగాహన పెంపొందిస్తారు. ప్రభుత్వం ద్వారా రూపొందించిన నియమనిబంధనల గురించి ప్రజలకు చెప్పడానికి అనేక వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు మరియు మీటింగ్‌లు నిర్వహించబడతాయి. ఇది కేవలం ముందస్తు జాగ్రత్త చర్యలపైన మాత్రమే కాకుండా, బ్యానర్‌లు, కరపత్రాలు మరియు హ్యాండ్ అవుట్‌ల ద్వారా కూడా ప్రజానీకానికి అవగాహన కల్పిస్తుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరుతో కూడిన బోర్డులు అనేక ప్రాంతాల్లో ఉంచబడతాయి.

  మోటార్ వేహికల్స్ (సవరణ) బిల్లు, 2019 అంటే ఏమిటి?

  వాస్తవంగా మోటార్ వేహికల్స్ యాక్ట్ 1099లో అమల్లోనికి వచ్చినప్పటికీ, 2019లో ఈ బిల్లుకు సవరణలు చేశారు. రాష్ట్రాలకు చెందిన రవాణా మంత్రుల బృందం చేసిన అనేక సిఫారసులు ఆధారంగా అనేక కీలక అంశాలు ఇందులో చేర్చారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై విధించే జరిమానాలను పెంచింది, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కాలాన్ని ఒక నెల నుంచి సంవత్సరానికి పెంచింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి అత్యవసర వైద్య నిధిని అందిస్తుంది. అన్నింటిని మించి, డ్రైవర్ తన లైసెన్స్‌ని రెన్యువల్ చేయించుకునే సమయంలో తన సామర్ధ్యాన్ని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా, ప్రమాదాలు జరిగినప్పుడు మరణం లేదా ప్రధాన గాయానికి కనీస నష్టపరిహారం పెంచబడింది.

  ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన మరియు అనుసరించాల్సిన సాధారణ రోడ్డు భద్రతా నియమాలు ఏమిటి?

  భారతదేశంలోని రోడ్డు భద్రత గురించి ప్రతిపౌరుడు విమర్శించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అనేక ప్రాథమిక ట్రాఫిక్ నిబంధనలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ లైట్‌లను అనుసరించడం అనే విషయంతో పాటుగా, మీరు రోడ్డు సైన్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకే లైనును అనుసరించాలి, అవసరమైనప్పుడు ఇండికేటర్‌ని ఉపయోగించాలి. గడువు తీరిన లైసెన్స్‌తో మీరు డ్రైవ్ చేయకుండా చూసుకోవాలి. ‘L’ మరియు ‘బేబీ ఆన్ బోర్డ్’ వంటి సైన్‌లు మీకు దగ్గరగా డ్రైవ్ చేసే వారు మరింత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి దోహదపడతాయి. ఇక చిట్టచివరి విషయం. మీ వాహనాలను దయచేసి పార్కింగ్ జోన్‌ల్లో మాత్రమే పార్క్ చేయండి.

  ఈ విషయాలను మదిలో పెట్టుకోండి. మనం ఇప్పుడు ఈ #RoadSafetyWeekలో #RoadToSafety వాగ్ధానం చేద్దాం మరియు #DriveResponsibly దిశగా డ్రైవ్ చేద్దాం.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Road Accident, Road Safety

  తదుపరి వార్తలు