హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Puri Jagannath Temple: పూరి జగన్నాథుడికి ఊహించని కష్టాలు.. తట్టుకోలేకపోతున్న ఆలయ సేవకులు..

Puri Jagannath Temple: పూరి జగన్నాథుడికి ఊహించని కష్టాలు.. తట్టుకోలేకపోతున్న ఆలయ సేవకులు..

పూరి జగన్నాధ్ ఆలయం (ఫైల్ ఫోటో)

పూరి జగన్నాధ్ ఆలయం (ఫైల్ ఫోటో)

Puri Jagannath Temple: ఎలుకలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి ప్రతిదీ నాశనం చేస్తున్నాయని.. పరిసరాలు చాలా అపరిశుభ్రంగా మారుతున్నాయని ఆలయన సేవకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయానికి ఊహించని కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రసిద్ధమైన ఈ ఆలయాన్ని ఇప్పుడు ఎలుకల బెడద తీవ్రంగా వేధిస్తోంది. ప్రతిరోజూ వందలాది ఎలుకలు(Rats) ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విపరీతంగా తిరుగుతున్నాయి. మూషిక సైన్యం గర్భగుడిలోకి ప్రవేశించి అన్ని వస్తువులను పాడుచేస్తున్నాయి. ఆలయంలో ఉంచిన చెక్క విగ్రహాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నిత్యం పూజలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఎలుకల బెడదను తక్షణమే అరికట్టకపోతే సమస్య పరిష్కారం అసాధ్యమని వాపోతున్నారు. అయితే ఆలయ అధికారులు త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎలుకల బెడద ఈ స్థాయిలో పెరగడానికి ప్రత్యేకమైన కారణం ఉంది.

2020, 2021లో పూరీ జగన్నాథ(Puri Jagannath Temple) ఆలయాన్ని చాలా కాలం పాటు సందర్శకులకు అనుమతి లేకుండా మూసివేశారు. ఇతర సమయాల్లో, ప్రేక్షకుల గుంపు ఒత్తిడిలో ఎలుకల గుంపులు ఆ విధంగా బయటకు రాలేవు. కానీ ఖాళీగా ఉన్న గుడి దొరకడంతో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి. పూరీ ఆలయంలో ఎలుకలే కాదు, బొద్దింకలు సంఖ్య కూడా వేగంగా పెరిగింది. రాత్రిపూట చీకట్లో ఆలయాన్ని పాడు చేస్తున్నాయి. విగ్రహాల దుస్తులను కత్తిరించడం నుండి ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేయడం వరకు ఆలయ సేవాయాత్‌లు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఎలుకలు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి ప్రతిదీ నాశనం చేస్తున్నాయని.. పరిసరాలు చాలా అపరిశుభ్రంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ దినచర్య ప్రకారం పూజలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామమని... విగ్రహ బట్టల నుంచి పూజల దండల వరకు అన్నీ పాడు చేస్తున్నాయని వాపోతున్నారు.ఆలయ రాతిలో అనేక పగుళ్లు ఉన్నాయని...అక్కడి నుంచి ఎలుకల సైన్యం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాయని అన్నారు. వాటిని ఇప్పటికైనా ఆపకుంటే ఆలయంలో ఉంచిన చెక్క విగ్రహాలు పూర్తిగా ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని ఆలయ నిర్వాహక సంఘం తెలిపింది.

Karnataka-Congress: 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, గృహిణులకు నెలకు రూ. 2000.. కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల హామీలు

PM Modi: అగ్నివీర్స్ మొదటి బ్యాచ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ .. గేమ్ ఛేంజర్ అవుతుందని ధీమా

అయితే విషం(Poison) పెట్టి ఎలుకలను చంపేందుకు ఆలయ అధికారులు మొగ్గు చూపడం లేదు. ఈ సంఘటన గురించి తమకు తెలుసని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని... ఆలయంలో ఎలుకల నిర్మూలనకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి వలలు ద్వారా ఎలుకలు పట్టే ప్రయత్నం జరుగుతోందని.. వారిని పట్టుకొని ఆలయానికి దూరంగా వదిలిపెడతామని అన్నారు. అయితే తాము ఎలుకలను విషంతో చంపలేమని అన్నారు. ఈ సమస్యను ఆలయ అధికారులు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా తెలియజేసినట్లు సమాచారం.

First published:

Tags: Odisha

ఉత్తమ కథలు