#MissionPaani : తాగునీటి పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత : అమితాబ్

MissionPaani : .8ఏళ్ల క్యాంపెయిన్ ద్వారా దేశంలో పోలియో లేకుండా చేయగలిగామని గుర్తుచేసిన అమితాబ్..తాగునీటి పరిరక్షణ కోసం కూడా దీర్ఘకాలిక క్యాంపెయిన్ జరగాలన్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 3:10 PM IST
#MissionPaani : తాగునీటి పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత : అమితాబ్
అమితాబ్ బచ్చన్
  • Share this:
నెట్‌వర్క్18-హార్పిక్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ పానీ క్యాంపెయిన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ముంబైలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమితాబ్ మిషన్ పానీ క్యాంపెయిన్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు,చర్చల ద్వారా ప్రజల్లోకి మంచి సందేశం వెళ్తుందన్నారు. తాగునీటి విషయంలో దేశం ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితులపై అందరిలో అవగాహన ఏర్పడుతుందన్నారు.8ఏళ్ల క్యాంపెయిన్ ద్వారా దేశంలో పోలియో లేకుండా చేయగలిగామని గుర్తుచేసిన అమితాబ్..తాగునీటి పరిరక్షణ కోసం కూడా దీర్ఘకాలిక క్యాంపెయిన్ జరగాలన్నారు.భవిష్యత్‌లో తాగునీరు లేకపోతే ఎదురయ్యే పరిస్థితులపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ ఒక్కరు తాగునీటి పరిరక్షణ కోసం నడుం బిగించాలని,అది అందరి బాధ్యత అని అన్నారు. తాగునీటి పరిరక్షణను ప్రతీ ఒక్కరు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మన చుట్టూ ఉండే పరిసరాల్లో దీన్ని మనం ఆచరణలో పెట్టాలన్నారు.

Published by: Srinivas Mittapalli
First published: August 27, 2019, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading