EVEN A TWO DAY STAY WITH LOVER IS ALSO LIVE IN RELATIONSHIP SAYS PUNJAB HARYANA HIGH COURT SK
2 రోజులు కలిసున్నా సహజీవనమే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
తాము సహజీవనం చేస్తున్నామని.. తన ప్రియురాలిని అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దానిపై విచారించిన డివిజనల్ బెంచ్.. ప్రేమికులు రెండు రోజులు కలిసున్నా దాన్ని సహజీవనంగానే పరిగణించాలని స్పష్టం చేసింది.
ప్రేమికులు రెండు రోజులు కలిసున్నా అది సహజీవనం కిందకే వస్తుందట..! సహజీవనానికి కొత్త నిర్వచనం చెబుతూ.. పంజాబ్, హర్యానా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన ప్రియురాలిని అప్పగించాంటూ ఓ యువకుడు వేసిన పిటిషన్‌పై విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు డివిజనల్ బెంచ్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు తన ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. అది అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. బలవంతంగా అతడి నుంచి విడదీసి ఇంటికి తీసుకెళ్లారు. దాంతో ఆమె ప్రియుడు హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ అతడికి చుక్కెదురయింది. సదరు యువకుడితో ఆమె సహజీవనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు ఆ యువతి కుటుంబం పరువు తీశాడని చివాట్లు పెట్టి.. లక్ష రూపాయలు జరిమానా విధించింది.
హైకోర్టు సింగింల్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాడు ఆ యువకుడు. డివిజనల్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశాడు. తాము సహజీవనం చేస్తున్నామని.. తన ప్రియురాలిని అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దానిపై విచారించిన డివిజనల్ బెంచ్.. ప్రేమికులు రెండు రోజులు కలిసున్నా దాన్ని సహజీవనంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఐతే ప్రియురాలిని అప్పగించాలన్న ఆ యువకుడి వాదనను మాత్రం తోసిపుచ్చింది. ఎందుకంటే అతడికి కేవలం 20 ఏళ్లు వయసు మాత్రమే ఉంది. 21 ఏళ్ల నిండనిదే పెళ్లి చేసుకోవడం కుదరని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. కాగా, సహజీవనంపై పంజాబ్, హర్యానా హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.