హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: ఒక్క ఉగ్రదాడి కూడా జరగొద్దు.. యాంటీ టెర్రర్‌ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

PM Modi: ఒక్క ఉగ్రదాడి కూడా జరగొద్దు.. యాంటీ టెర్రర్‌ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi: శుక్రవారం దేశ రాజధానిలో కౌంటరింగ్‌ ఫైనాన్షింగ్‌ ఆఫ్‌ టెర్రరిజంపై జరిగిన మూడో మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. అన్ని ఉగ్రదాడులకు ఒకే రకంగా స్పందిస్తామని, దాడులు సంభవించిన ప్రాంతాన్ని బట్టి ప్రతిస్పందన మారదని మోదీ అన్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

PM Narendra  Modi: ఉగ్రవాదులకు నిధులు (Terror funding) అందకుండా నిరోధించాలనే లక్ష్యంతో ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi). శుక్రవారం దేశ రాజధానిలో కౌంటరింగ్‌ ఫైనాన్షింగ్‌ ఆఫ్‌ టెర్రరిజంపై జరిగిన మూడో మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. అన్ని ఉగ్రదాడులకు ఒకే రకంగా స్పందిస్తామని, దాడులు సంభవించిన ప్రాంతాన్ని బట్టి ప్రతిస్పందన మారదని మోదీ అన్నారు.

‘కౌంటరింగ్‌ ఫైనాన్షింగ్‌ ఆఫ్‌ టెర్రరిజం’పై నవంబర్ 18, 19న ఈ కార్యక్రమం జరగనుంది. ఈరోజు ప్రధాని మోదీ సదస్సును ప్రారంభించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్ పాల్గొనడం లేదని చైనా నుంచి ఇంకా నిర్ధారణ రాలేదని భారత్ గురువారం తెలిపింది. అయితే 20 దేశాల మంత్రులతో సహా మొత్తం 78 దేశాలు, మల్టిలేటరల్‌ ఆర్గనైజేషన్స్‌ అధిపతులు హాజరవుతారు.

* దాడి ఎంతదైనా ప్రతిస్పందన ఒక్కటే

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. చిన్న దాడి అయినా, ఒక్క ప్రాణమైనా చాలా ఎక్కువని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని పునరుద్ఘాటించారు. ఈ సదస్సు భారతదేశంలో జరగడం ముఖ్యమని, మన దేశం చాలా కాలం పాటు తీవ్ర భయాందోళనలను ఎదుర్కొందని తెలిపారు. ప్రపంచం దీనిని తీవ్రంగా పరిగణించకముందే.. దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నించిందని, అయితే ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.

* టెర్రరిజం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి

టెర్రరిజం ఫైనాన్స్‌ మూలాలను దెబ్బ కొట్టాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. నిరంతరం థ్రెట్‌ కింద బతకడం ఎవరికీ ఇష్టముండదని, దీని కారణంగా ప్రజల జీవనోపాధి దూరమవుతోందని అన్నారు. ఉగ్రవాదాన్ని మానవత్వం, స్వేచ్ఛ, నాగరికతపై దాడిగా మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముప్పుతో పోరాడేటప్పుడు సందిగ్ధ ధోరణికి చోటు లేదన్నారు. నేటి ప్రపంచంలో ఉగ్రవాదం ప్రమాదాల గురించి ప్రపంచానికి ఎవరూ గుర్తు చేయవలసిన అవసరం లేదని, కొన్ని సర్కిల్‌లలో ఇప్పటికీ ఉగ్రవాదం గురించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని మోదీ చెప్పారు. దాడులకు ప్రతిస్పందన తీవ్రత ఆధారంగా ఉండకూడదని, ఎక్కడ జరిగినా ఒకే రకమైన బాధ, ఆవేదన ఉంటాయన్నారు.

* గత సదస్సుకు వేదికైన పారిస్‌, మెల్‌బోర్న్‌

దీనికి సంబంధించి ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (PMO) ఒక ప్ర‌క‌ట‌న‌లో.. ఈ స‌మావేశం కౌంటర్‌ టెర్రరిజం ఫైనాన్షింగ్‌, పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశాలకు, ఆర్గనైజేషన్లకు ఒక వేదికను అందిస్తుందని పేర్కొంది. 2018 ఏప్రిల్‌లో పారిస్‌లో, 2019 నవంబర్‌లో మెల్‌బోర్న్‌లో జరిగిన మునుపటి రెండు సమావేశాల లాభాలు, అభ్యాసాల ఆధారంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, ఆపరేట్ చేయడానికి అనుమతించే అధికార పరిధిని నిరాకరించడానికి ప్రపంచ సహకారాన్ని పెంపొందించే దిశగా కూడా ఇది పని చేస్తుంది.

* 450 మందికి పైగా ప్రతినిధులు

వివిధ దేశాల మంత్రులు, మల్టిలేటరల్‌ ఆర్గనైజేషన్స్‌ అధిపతులు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) డెలిగేషన్స్ సహా ప్రపంచవ్యాప్తంగా 450 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని PMO తెలిపింది. కాన్ఫరెన్స్ సందర్భంగా.. గ్లోబల్‌ ట్రెండ్స్‌ ఇన్‌ టెర్రరిజం అండ్‌ టెర్రరిస్ట్‌ ఫైనాన్షింగ్‌, యూజ్‌ ఆఫ్‌ ఫార్మల్‌ అండ్‌ ఇన్‌ఫార్మల్‌ ఛానల్స్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆఫ్‌ టెర్రరిజం, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్‌ టూ అడ్రెస్‌ ఛాలెంజెస్‌ ఇన్‌ కాంబ్యాటింగ్‌ టెర్రరిస్ట్‌ ఫైనాన్షింగ్‌ సవాళ్లను అధిగమించడంపై చర్చించనున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశం దృఢసంకల్పం, విజయం సాధించడానికి తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తుంది.

First published:

Tags: Narendra modi, Pm modi, Terrorism

ఉత్తమ కథలు