నేడు కాశ్మీర్‌లో ఈయూ బృందం పర్యటన... వాస్తవాల పరిశీలన

మోదీతో ఈయూ ఎంపీల బృందం

Jammu Kashmir Tour : జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత... ఇప్పటివరకూ ఏ విదేశీ ప్రతినిధి బృందమూ అక్కడ పర్యటించలేదు. ఇప్పుడు వెళ్తున్న ఈయూ బృందం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

 • Share this:
  Jammu Kashmir Tour : జమ్మూకాశ్మీర్‌లో ఒక్కసారి ఆంక్షలు తొలగించండి... అప్పుడు తెలుస్తుంది అసలు నిజం అంటూ... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రపంచ దేశాలు సీరియస్‌గా తీసుకున్నాయి. నిజంగానే జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి బాలేదా? ఆంక్షలు తొలగిస్తే... ఏం జరుగుతుంది? ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై తిరగబడతారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు యూరోపియన్ యూనియన్‌కి చెందిన 28 మంది ఎంపీల బృందం ఇవాళ జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనుంది. ఇందుకు సంబంధించి ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. మంగళవారం కాశ్మీర్‌లో పర్యటించనున్నట్లు తెలిపింది. దీనిపై ప్రధాని మోదీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అన్నీ చూసి రండి. వాస్తవాలు తెలుసుకోండి. అక్కడకు వెళ్తే నిజానిజాలు మీకే తెలుస్తాయి అని వాళ్లతో అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్ని ప్రోత్సహించేవారినీ, వాటికి మద్దతు తెలిపేవారిపై చర్య తీసుకోవాలని కోరారు.

  ఇవాళ వెళ్లే బృందానికి ఆర్టికల్ 370 అంటే ఏంటి? దాని చరిత్ర, రద్దు అన్నీ ప్రధాని మోదీ... పూర్తిగా వివరించారు. ఏ పరిస్థితుల్లో దాన్ని తొలగించాల్సి వచ్చిందో తెలిపారు. దీనికి కొనసాగింపుగా... ఆ బృందం... నేడు జమ్మూకశ్మీర్‌ ప్రజలతో మాట్లాడుతుంది. అలాగే... సరిహద్దు దగ్గర పరిస్థితిని కళ్లారా చూస్తారు. అదే సమయంలో భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి వారికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ టీమ్ ప్రజలతోపాటూ... అక్కడి డాక్టర్లు, మీడియాతో కూడా మాట్లాడాలని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కోరారు.

  ఈ బృందం చెప్పే అంశాల్ని ప్రపంచ దేశాలు లెక్కలోకి తీసుకోవు. ఎందుకంటే... ఇది అధికారిక పర్యటన కాదు. ఈ బృందంలో ఎంపీలు చేసే వ్యాఖ్యలు వారి అభిప్రాయాలు మాత్రమే అవుతాయి. ఒకవేళ జమ్మూకాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు లేవని ఈ బృందం అభిప్రాయపడితే... దాన్ని ప్రపంచ దేశాలు పరిగణనలోకి తీసుకోవు. అయితే... ఈ బృందం అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేవంటున్నాయి కేంద్ర వర్గాలు. ఆర్టికల్ 370 ఉన్నప్పుడు, రద్దు తర్వాత పరిస్థితుల్ని పోల్చితే... ఎప్పుడు కాశ్మీర్ ప్రశాంతంగా ఉందో తెలుస్తుందంటున్నారు.

   

  Pics : అందాల బాల శుభ పూంజా క్యూట్ ఫొటోస్

  ఇవి కూడా చదవండి :

  బోరుబావిలో చిన్నారి మృతి... రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత

  Health Tips : రేగుపండ్లు తింటున్నారా... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


  Diabetes Tips : పసుపుతో డయాబెటిస్‌కి చెక్... ఎలా వాడాలంటే...

  Health Tips : పండగ సీజన్‌లో డయాబెటిస్ కంట్రోల్ ఎలా... ఇలా చెయ్యండి

  Fitness Health : కొలెస్ట్రాల్‌ని కట్టడి చేసే కరివేపాకు

  First published: