హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Engineers’ Day 2020: దేశం గర్వించే ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Engineers’ Day 2020: దేశం గర్వించే ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

నేడు భారతదేశపు అత్యుత్తమ ఇంజినీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ రోజును దేశవ్యాప్తంగా ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Engineers’ Day 2020: ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా.. సెప్టెంబర్ 15ను భారతదేశంలో నేషనల్ ఇంజినీర్స్ డే జరుపుకుంటారు. దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం. సివిల్, మెకానికల్ ఇంజినీర్లు అనే తేడా లేకుండా.. వారు మౌలిక సదుపాయాలకు వెన్నెముకను నిర్మిస్తారు. మనం నివసించే భవనాలు, మనం ఉపయోగించే కంప్యూటర్లు వంటి ప్రతిదాని వెనుక ఒక ఇంజినీర్ హస్తం తప్పకుండా ఉంటుంది.

నేడు భారతదేశపు అత్యుత్తమ ఇంజినీర్లలో ఒకరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ రోజును దేశవ్యాప్తంగా ఇంజినీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కర్ణాటకలోని ముద్దనేహళ్లి అనే చిన్న గ్రామంలో సెప్టెంబర్ 15, 1861న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. ఇంజినీరింగ్ రంగంలో ఆయన సేవలు అమోఘం. దీంతో పాటు విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన్ను “వి.ఎం సర్” అని కూడా పిలుస్తారు.

వీఎం తల్లిదండ్రులిద్దరూ సంస్కృత పండితులు. గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన తరువాత, ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వెళ్లారు విశ్వేశ్వరయ్య. అక్కడ బీఏ ఆర్ట్స్ చదివారు. కానీ ఆయనలో ఉన్న ఒక ఆవిష్కర్త ఆ చదువుతో సంతృప్తి చెందలేదు. తరువాత పుణె కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. నీటిపారుదల, వరద విపత్తు నిర్వహణ రంగాల్లో ఆయనకు మంచి నైపుణ్యం ఉండేది. ఆధునిక నీటిపారుదల పద్ధతులు, వరద నిర్వహణ రంగాల్లో ఆయన చేసిన కృషికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.

1903లో పుణెలోని ఖడక్వాస్లా రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ‘ఆటోమేటిక్ బారియర్ వాటర్ ఫ్లడ్ గేట్స్’ ను ఆయన రూపొందించారు. భారతదేశంలో అతిపెద్ద ఆనకట్ట అయిన క్రిషన్ సాగర్ ఆనకట్టను డిజైన్ చేశారు.

నాలుగు దశాబ్దాలు ఇంజినీర్‌గా పనిచేసిన తరువాత, 1917 లో గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించారు విశ్వేశ్వరయ్య. దీన్ని ఇప్పుడు యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా మార్చారు. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన ఐదవ ఇంజినీరింగ్ కళాశాల.

ఆయన ఒక ఇంజినీర్. విద్యావేత్త కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పాలక మండలి సభ్యుడిగా సేవలందించారు. అనంతరం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో పాలక మండలిలో సభ్యుడిగా నియమితులయ్యారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీని కూడా స్థాపించారు. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా సంస్థ... భారతదేశ ఆర్థిక ప్రణాళిక రూపకర్తగా సర్ వీఎంను పేర్కొంది. ఆయన రీకన్‌స్ట్రక్టింగ్ ఇండియా, ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే రెండు పుస్తకాలు రాశారు. మైసూర్ సంస్థానానికి దీవాన్‌గా కూడా పనిచేశారు విశ్వేశ్వరయ్య. 1955 లో భారత ప్రభుత్వం భారత్ రత్న అవార్డుతో సర్ వీఎంను సత్కరించింది. ఆయన 1962లో మరణించారు. కానీ విశ్వేశ్వరయ్య అందించిన సంపద ఇప్పటికీ దేశాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంది.

First published:

Tags: Karnataka, National

ఉత్తమ కథలు