హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Maoist kidnap : ఫలించిన ఇంజనీర్ భార్య కష్టం.. ప్రజాకోర్టు తర్వాత విడుదల చేసిన మావోయిస్టులు

Maoist kidnap : ఫలించిన ఇంజనీర్ భార్య కష్టం.. ప్రజాకోర్టు తర్వాత విడుదల చేసిన మావోయిస్టులు

విడుదల తర్వాత ఇంజనీర్ ఆయన భార్య

విడుదల తర్వాత ఇంజనీర్ ఆయన భార్య

Maoist kidnap : గత ఏడు రోజుల క్రితం చత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా మ‌న్‌కేళి వ‌ద్ద సివిల్ ఇంజినీర్ అజ‌య్ ల‌క్రా ను కిడ్నాప్ చేసిన మావోలు ఎట్టకేలకు నేడు ప్రజా కోర్టు అనంతరం విడుదల చేశారు. దీంతో ఆయన భార్య చేసిన విజ్ఞ‌ప్తి ఫలించింది.

ఇంకా చదవండి ...

చత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా మ‌న్‌కేళి వ‌ద్ద సివిల్ ఇంజినీర్ అజ‌య్ ల‌క్రా, అటెండ‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ మ‌రుస‌టి రోజే ల‌క్ష్మ‌ణ్‌ను విడుద‌ల చేయ‌గా, అజ‌య్‌ను త‌మ వ‌ద్దే ఉంచుకున్నారు మావోయిస్టులు.

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులతో పాటు లొంగుబాట్లు, అరెస్ట్‌లు ఇటివల తీవ్రమయ్యాయి. ఏకంగా 26 మంది మావోలు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో పాటు అగ్రనేతల మృతి, తాజాగా జరుగుతున్న పరిణామాలు మావోయిస్టు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దీంతో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలను ఆ పార్టీ మమ్మురం చేసింది. ఈ క్రమంలోనే తన భర్తకు ఎదైన హాని తలపెట్టె అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఇంజనీర్ భార్య అర్పిత నేరుగా రంగంలోకి దిగింది.

ఇది చదవండి : వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను ఎలా ఆమోదిస్తారు... ? కోర్టుకు వెళతాం.


త‌న భ‌ర్త‌ను ప్రాణాల‌తో వ‌దిలిపెట్టాల‌ని ఇంజినీర్ భార్య అర్పిత నాలుగు రోజుల క్రితం అడ‌విలోకి వెళ్లింది. త‌న రెండేళ్ల కూతురిని ఎత్తుకుని, స్థానిక జ‌ర్న‌లిస్టుల స‌హాయంతో అర్పిత‌ మావోయిస్టుల వ‌ద్ద‌కు చేరింది. త‌న భ‌ర్త‌ను ప్రాణాల‌తో వ‌దిలిపెట్టాల‌ని మావోయిస్టుల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. మరోవైపు తన భర్త కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నాడని.. ప్రభుత్వంపైన ఉన్న ధ్వేషాన్ని తమ లాంటి చిన్న వాళ్లపైన చూపొద్దని, తన బతుకుని ఆగం చేయొద్దని ఆమె వేడుకుంది. దీనికోసం ఆమె ఎవరూ చేయలేని సాహసం చేసింది. ద్విచక్ర వాహనంపైన కూర్చొని ఆమె సరిగ్గా రోడ్డు సౌకర్యం కూడా లేని గిరిజన గూడేలా బాట పట్టింది. దీంతో మావోయిస్టులు నేడు ప్ర‌జాకోర్టు నిర్వ‌హించి అజ‌య్‌ను ఇవాళ విడుద‌ల చేశారు.

First published:

Tags: Kidnap, Maoist

ఉత్తమ కథలు