ENGINEER CHAIWALA LEFT ENGINEERING JOBS DUE TO LOW SALARIES BROTHERS OPEN TEA STALL GH SK
Engineer Chaiwala: ఇంజినీర్ జాబ్ కన్నా టీ స్టాల్తోనే ఎక్కువ ఆదాయం.. ఈ బ్రదర్స్ ఐడియా అదుర్స్
Engineers tea stall: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన అన్నదమ్ములు టీ అమ్మడం కోసం తమ ఇంజనీర్ ఉద్యోగాలనే వదిలేసారు. ఇప్పుడు ఆర్థికంగా, ఎమోషనల్‌గా సంతృప్తిగా ఉన్నామని ఈ ఇంజనీర్ చాయ్వాలాలు చెబుతుండటం విశేషం.
Engineers tea stall: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన అన్నదమ్ములు టీ అమ్మడం కోసం తమ ఇంజనీర్ ఉద్యోగాలనే వదిలేసారు. ఇప్పుడు ఆర్థికంగా, ఎమోషనల్‌గా సంతృప్తిగా ఉన్నామని ఈ ఇంజనీర్ చాయ్వాలాలు చెబుతుండటం విశేషం.
సాధారణంగా ఉన్నత చదువులు చదువుకున్న వారు తమ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ ఇంజనీరింగ్ చేసిన ఇద్దరు సోదరులు మాత్రం టీ కొట్టు పెట్టుకున్నారు. ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బు కంటే టీ స్టాల్ ద్వారానే తాము ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నామని చెబుతున్నారు. భారతదేశంలో ఇంజనీరింగ్ డిగ్రీకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్ని మోస్ట్ సెక్యూర్ కెరీర్ ఆప్షన్లలో ఒకటిగా కూడా అందరూ భావిస్తుంటారు. అలాంటిది పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన అన్నదమ్ములు టీ అమ్మడం కోసం తమ ఇంజనీర్ ఉద్యోగాలనే వదిలేసారు. ఇప్పుడు ఆర్థికంగా, ఎమోషనల్‌గా సంతృప్తిగా ఉన్నామని ఈ ఇంజనీర్ చాయ్వాలాలు చెబుతుండటం విశేషం.
'ఇంజనీర్ చాయ్‌వాలా' పేరుతో ఫేమస్ అయిన ఈ సోదరులు ఇంజనీర్లుగా తమ ఉద్యోగాలలో సంపాదించిన దానికంటే చాయ్ (టీ) అమ్మడం ద్వారానే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. గమ్మత్తేమిటంటే, వారు విక్రయించే టీ ధర మరీ ఎక్కువేం కాదు. వారి టీస్టాల్ జాతీయ రహదారి- 2 వెంబడి ఉంటుంది.
వివరాల్లోకి వెళితే.. సుమన్ కర్ అనే యువకుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడు కార్ షోరూమ్‌లో పనిచేశాడు. అయితే చక్కటి లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి.. తనకొచ్చే అరకొర జీతం సరిపోయేది కాదట. దాంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ ప్రారంభించాలని అనుకున్నాడు కానీ దానికి సరిపడా డబ్బు అతని దగ్గర లేదు. అప్పుడే టీ స్టాల్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఇంత చదువు చదువుకొని టీ కొట్టు పెట్టడం ఏంట్రా? అని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారట. అయితే ఎవరి మాట పట్టించుకోకుండా టీ విక్రయించడం ప్రారంభించాడు సుమన్.
మొదట్లో సుమన్ ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల టీ అమ్మేవాడు. ఇప్పుడు రోజుకు 40 లీటర్ల టీ విక్రయిస్తున్నాడు. టీ ధర రూ.10 నుంచి ప్రారంభమవుతుంది. కప్పు సైజు ఆధారంగా ధరలు మారుతుంటాయి. అయితే గరిష్ఠ ధర రూ. 30గా నిర్ణయించాడు. చాలా స్లోగా ప్రారంభమైన అతడి టీ వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తోంది. దాంతో సుమన్ తమ్ముడు సుమిత్ కర్ కూడా తన ఇంజనీరింగ్ కెరీర్ ని వదిలేసి అన్నయ్య వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు ఈ సోదరులు తమ టీ వ్యాపారాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు.
సుమన్ తమ్ముడు సుమిత్ కర్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీతో సహా అనేక పోటీ పరీక్షలకు హాజరయ్యాడు. కానీ చివరికి అతడు తన అన్నయ్య బిజినెస్ లోనే ఫుల్ టైం పార్ట్నర్గా చేరిపోయాడు. ఏ ఉద్యోగాన్ని కూడా చిన్నచూపుతో చూడకూడదని సుమిత్ అంటున్నాడు. “మా టీ రుచి రాబోయే రోజుల్లో మరింత మందికి చేరువవ్వాలని కోరుకుంటున్నాను. మా నాన్నగారి సహకారంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను’’ సుమిత్ తెలిపాడు.
పనగఢ్, బిధానగర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు టీ తాగడం కోసం ఇంజనీర్ చాయ్‌వాలా స్టాల్ కు వస్తారు. ఇతర టీ షాప్స్ కంటే ఇక్కడి టీ రుచి కొద్దిగా భిన్నంగా ఉంటుందని కస్టమర్లు అంటున్నారు. ఇక్కడ మట్టి గ్లాసులో టీ తాగడం చాలా బాగుంటుందని కస్టమర్లు తెలిపారు. అరకొర జీతానికి గొడ్డు చాకిరీ చేయడం కంటే వ్యాపారం పెట్టుకోవడమే మేలని ఈ సోదరులు ముందడుగు వేయడం స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.