Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: April 26, 2019, 12:15 PM IST
రాహుల్ గాంధీ (File)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచీ పాట్నాకు ప్రత్యేక విమానంలో బయలుదేరగా... విమానం గాల్లోకి లేచిన తర్వాత ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. అలర్టైన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. సాధారణంగా విమానాలు గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తితే... వాటిని సేఫ్‌గా ల్యాండ్ చెయ్యడం చాలా కష్టం. రాహుల్ విమానం నడుపుతున్న పైలెట్ ఎంతో చాకచక్యంగా ప్లేన్‌ను కిందకు దింపారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్టర్లో వీడియో పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందవద్దనీ, తాను సభలకు రావడానికి కాస్త ఆలస్యం అవుతుందని రాహుల్ తన ట్వీట్లో తెలిపారు.
లోక్‌సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా రాహుల్... ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బీహార్‌లోని పాట్నాకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన కాసేపటికే విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి తరలించారు. తిరిగి విమానం బయలుదేరేందుకు కొంత టైం పడుతుందనీ, అందువల్ల ఇవాళ బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కొద్దిగా ఆలస్యంగా జరుగుతాయని, కార్యకర్తలు సహకరించాలని తన ట్వీట్ ద్వారా కోరారు రాహుల్.
రాహుల్ పెట్టిన ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు... ఆ ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
21,000 మంది సిబ్బంది... మే 23న భారీ భద్రత మధ్య ఏపీ ఎన్నికల లెక్కింపు...
ముస్లింలు ఉగ్రవాదులు కాదు... వారిని అలా చూడొద్దని కోరిన శ్రీలంక అధ్యక్షుడు...
తాగి వస్తున్న భర్తకు తిండి పెట్టడం మానేసింది... అతను ఏం చేశాడంటే...
శ్రీలంకలో చనిపోయింది 253 మందే... లెక్క తప్పిందన్న శ్రీలంక ప్రభుత్వం...
Published by:
Krishna Kumar N
First published:
April 26, 2019, 12:09 PM IST