Home /News /national /

ENFORCEMENT DIRECTORATE ED RAIDS AT SHIV SENA MP SANJAY RAUT HOUSE IN MUMBAI IN PATRA CHAWL LAND SCAM MKS

Sanjay Raut | ED : సంజయ్ రౌత్‌కు బ్యాడ్ మార్నింగ్.. శివసేన ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు..

సంజయ్ రౌత్ ఇంటి వద్ద ఈడీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది

సంజయ్ రౌత్ ఇంటి వద్ద ఈడీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది

మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుంగుడు, శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ కు ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుడ్ మార్నింగ్ చెప్పింది. ముంబైలోని రౌత్ నివాసం మైత్రిలో ఆదివారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

శివసేన (Shiv Sena) పార్టీ నిలువునా చీలిపోయి, బీజేపీ మద్దతుతో రెబల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎం అయిన తర్వాత మహారాష్ట్ర (Maharashtra)లో మరో కీలక ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుంగుడు, శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut)కు ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) (Enforcement Directorate)గుడ్ మార్నింగ్ చెప్పింది. ముంబైలోని రౌత్ నివాసం మైత్రిలో ఆదివారం ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పత్రాచల్‌ భూకుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఎంపీ సంజయ్ రౌత్ పై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనే ఈడీ అధికారులు ఇవాళ రౌత్ ఇంట్లో సోదాలు చేపట్టారు. నోటీసులకు ఎంపీ స్పందించని కారణంగా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇవాళ నేరుగా ఇంటికెళ్లి ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.


CM KCR : గండం గట్టెక్కేనా? ఉద్యోగులకు సకాలంలో జీతం అందేనా? ఢిల్లీలో కేసీఆర్ ఏం చేశారు?


పత్రాచల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు ఈడీ సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్‌ ఇంటికి వెళ్లారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎంపీ సంజయ్ రౌత్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరింపజేశారు. ఈడీ సోదాల సమయంలో ఎంపీ రౌత్ ఇంట్లోనే ఉన్నారని, ఆయనను అధికారులు ప్రశ్నించినట్లూ తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
Published by:Madhu Kota
First published:

Tags: Enforcement Directorate, Maharashtra, Mumbai, Sanjay Raut, Shiv Sena

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు