• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • ENFORCEMENT DIRECTORATE ARRESTED SENIOR KARNATAKA CONGRESS LEADER DK SHIVAKUMAR MK

కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ అరెస్టు...

కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ అరెస్టు...

గత నాలుగు రోజులుగా ఈడీ అధికారులు శివకుమార్‌ను విచారిస్తుండగా, ఆయన మనీలాండరింగ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలపై సమాధానం దాటవేస్తున్నారనే ఆరోపణలతో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.

  • Share this:
    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేసింది. గత నాలుగు రోజులుగా ఈడీ అధికారులు శివకుమార్‌ను విచారిస్తుండగా, ఆయన మనీలాండరింగ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలపై సమాధానం దాటవేస్తున్నారనే ఆరోపణలతో ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఈడీ హఎడ్ క్వార్టర్స్ లో డీకే శివకుమార్ ను విచారిస్తున్నారు. అయితే గత శుక్రవారం, శనివారం సైతం 8 గంటల చొప్పున శివకుమార్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా ఇప్పటికే డీకే శివకుమార్ వాంగ్మూలాన్ని పీఎంఎల్ఎ చట్టం కింద రికార్డు చేశారు. ఇదిలా ఉంటే గత నెల 30వ తేదీన డీకే శివకుమార్ తన స్వస్థలం కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి బెంగుళూరుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈడీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు.

    చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను అన్నింటికి సమాధానం చెబుతానని, అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద తనను ఎందుకు విచారిస్తున్నారో వారికే తెలియాలని డీకే పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే డీకే ఈ కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటీషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా 2017 సంవత్సరంలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కర్ణాటకలోని రిసార్టుల్లో ఉంచి, రాజకీయంగా చక్రంతిప్పిన వారిలో డీకే కీలక సూత్రధారి, అప్పటి నుంచే డీకే శివకుమార్ పేరు వార్తల్లో నానుతూ వస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే.శివకుమార్‌ను కావాలనే కేంద్రప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోందని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
    First published: