Home /News /national /

ENERGY MINISTER PRADHUMAN SINGH CLEANED THE TOILET AT A GOVERNMENT SCHOOL IN MADHYA PRADESH PRV

Minister cleaned the Toilet: బాలిక ఫిర్యాదు చేసిందని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్​ కడిగిన మంత్రి ... ఎక్కడో తెలుసా..? 

మరుగుదొడ్డి శుభ్రం చేస్తున్న మంత్రి (Photo:ANI/Twitter)

మరుగుదొడ్డి శుభ్రం చేస్తున్న మంత్రి (Photo:ANI/Twitter)

మధ్యప్రదేశ్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మురుగుదొడ్డిని ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ స్వయంగా శుభ్రం చేశారు. మరుగుదొడ్లను శుభ్రం చేసిన తర్వాత పరిశుభ్రత ముఖ్యమని ఆయన సందేశాన్ని ఇచ్చారు.

    ప్రభుత్వ పాఠశాలలు (Government schools) , కాలేజీలు, కార్యాలయాల్లో మరుగుదొడ్ల అపరిశుభ్రత గురించి వినే ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను సర్కారు ఎన్నిసార్లు ఆదేశించినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు ఓ మంత్రివర్యులు. మధ్యప్రదేశ్​లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మురుగుదొడ్డిని ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ (Energy Minister Pradhuman Singh) స్వయంగా శుభ్రం చేశారు. మరుగుదొడ్లను శుభ్రం చేసిన తర్వాత పరిశుభ్రత ముఖ్యమని ఆయన సందేశాన్ని ఇచ్చారు. పాఠశాలలో పరిశుభ్రత పాటించడంలేదని ఓ విద్యార్థి (student) ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులకు చెప్పకుండానే స్వయంగా మంత్రి వచ్చి టాయిలెట్స్ శుభ్రం (Toilets cleaned) చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో పాఠశాల సిబ్బంది (School staff)తో సహా మున్సిపల్ అధికారులు (Municipal Officials) అవాక్కయ్యారు. పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు పాఠశాలల్లోని మరుగుదొడ్ల (Toilets)ను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

    30 రోజుల పరిశుభ్రత ప్రతిజ్ఞ..

    ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ మాట్లాడుతూ..  “పాఠశాలలోని మరుగుదొడ్లలో పరిశుభ్రత లేదని, దాని వల్ల విద్యార్థులు (Students) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక బాలిక (girl) నాతో చెప్పింది” అని మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ చెప్పారు. “నేను 30 రోజుల పరిశుభ్రత ప్రతిజ్ఞ  (30 day hygiene pledge) చేశాను. ప్రతి రోజు ఏదో ఒక సంస్థకు వెళ్లి దానిని శుభ్రం (Clean) చేస్తాను, శుభ్రత సందేశం ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నా,” అని మంత్రి చెప్పారు.



    అయితే ఈ విషయం సోషల్​ మీడియా (Social media)లో వైరల్​గా మారింది. ఒక్కరోజులోనే ప్రధుమాన్​ సింగ్​ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇక సోషల్​ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు (netizens) తెగ చర్చించుకున్నారు. దేశంలోని మంత్రులు ఇదే పద్దతిలో ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

    ఇది కూడా చదవండి: సొరంగంలో నుంచి బయటకొచ్చిన 17 మంది అమ్మాయిలు.. పోలీసులు షాక్​.. ఇంతకీ ఏంటీ కథ.. ఎక్కడ జరిగింది.. 

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Madhya pradesh, School, Toilet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు