• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • END OF GOOD TIMES VIJAY MALLYA MAY BE FLOWN TO INDIA TONIGHT SAYS REPORT SK

ఈ రాత్రికే లండన్‌ నుంచి ముంబైకి విజయ్ మాల్యా.. నేరుగా జైలుకే..

విజయ్ మాల్యా

ముంబై ఎయిర్‌పోర్టు నుంచి మాల్యాను నేరుగా ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌కు తరలిస్తారని సమాచారం. అక్కడ సీబీఐ అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అనంతరం గురువారం మాల్యాను కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.

  • Share this:
    భారతీయ బ్యాంకులను నిండా ముంచిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా కథ క్లైమాక్స్‌కు చేరింది. లండన్‌ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలగడంతో అక్కడి ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించనుంది. మాల్యా అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తయింది. బ్రిటన్ హోంమంత్రి కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇవాళ రాత్రికే లండన్ నుంచి ముంబైకి తరలిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి మాల్యాను నేరుగా ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌కు తరలిస్తారని సమాచారం. అక్కడ సీబీఐ అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అనంతరం గురువారం మాల్యాను కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. మాల్యాను కస్టడీకి అప్పగించాలని సీఐడీ, ఈడీ కోర్టును కోరే అవకాశముంది. ఐతే మాల్యా అప్పగింతకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

    కాగా, కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని విజయ్ మాల్యాపై ఆరోపణలున్నాయి. పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపై రుణాలను ఎగవేసినట్లు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. అప్పులు, ఆర్థిక కష్టాల్లో కింగ్ ఎయిర్‌లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. అనంతరం విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయారు. ఐతే
    మాల్యాను భారతదేశానికి అప్పగించాలంటూ వెస్ట్‌ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి ఆమోదించిన విషయం తెలిసిందే.

    మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన అప్పీలును కొట్టివేస్తూ ఏప్రిల్ 20న హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపైనా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. మే 14న విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌ను యూకే సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో బ్రిటన్‌లో మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేసిన వెంటనే ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారు. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: