హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Jammu Kashmir: కాశ్మీర్ లో ఆర్మీ ట్రిపుల్ అటాక్...ఒకే సారి మూడు ఏరియాల్లో ఉగ్రవాదుల ఏరివేత..

Jammu Kashmir: కాశ్మీర్ లో ఆర్మీ ట్రిపుల్ అటాక్...ఒకే సారి మూడు ఏరియాల్లో ఉగ్రవాదుల ఏరివేత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూ కాశ్మీర్‌లో భారత ఆర్మీ బలగాలు ఉగ్రవాదులపై శనివారం మూడు ప్రాంతాల్లో ఒకే సారి దాడి చేశాయి. పుల్వామా, కుల్గాం, అనంతనాగ్‌లలో ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్ జరుగుతోంది. అనంతనాగ్, కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.

ఇంకా చదవండి ...

  జమ్మూ కాశ్మీర్‌లో భారత ఆర్మీ బలగాలు ఉగ్రవాదులపై శనివారం మూడు ప్రాంతాల్లో ఒకే సారి దాడి చేశాయి. పుల్వామా, కుల్గాం, అనంతనాగ్‌లలో ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్ జరుగుతోంది. అనంతనాగ్, కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గత వారంలో 14 మంది ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు హతమార్చాయి. పుల్వామాకు చెందిన గులాబ్ బాగ్ ట్రాల్, కుల్గాం, నిపోరా, అనంతనాగ్ లోని లాన్ ప్రాంతాల్లో కొంతమంది ఉగ్రవాదులు పెద్ద కుట్ర చేయడానికి యోచిస్తున్నట్లు భారత భద్రతా దళాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం లభించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా భారత భద్రతా దళాలు స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌తో కలిసి సంయుక్త మూడు ప్రాంతాలను ముట్టడి చేయడం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు, ఉగ్రవాదులు తమను చుట్టుముట్టడంతో కాల్పులు ప్రారంభించారు.

  అనంతనాగ్‌లో 2 ఉగ్రవాదులు మృతి

  ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం, అనంతనాగ్ మరియు కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా 3 మంది ఉగ్రవాదులు గులాబ్ బాగ్ త్రాల్ లోని ఇంట్లో దాక్కున్నట్లు సమాచారం. రెండు వైపుల నుండి నిరంతరం కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు, షోపియాన్, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు సమాచారం ఉంది. పట్టుబడిన ఉగ్రవాది ఇటీవల ఉగ్రవాద సంస్థలో చేరినట్లు చెబుతున్నారు.

  ఈ సంవత్సరం 101 మంది ఉగ్రవాదులు ఖతం

  ఇటీవల, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు 101 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయని, దక్షిణ కాశ్మీర్‌లో 25 మంది విదేశీయులతో సహా మరో 125 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇటీవల అధికారులు తెలిపారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Jammu and Kashmir, Terrorists

  ఉత్తమ కథలు