Home /News /national /

ENCOUNTER IN GADCHIROLI TWO MAOIST HAVE BEEN DEAD VS

Encounter : మరో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు మృతి

Encounter : ఇటు చత్తీస్‌ఘడ్ ,అటు మహారాష్ట్రా అడవులు ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతున్నాయి. గడిచిన కోద్ది రోజుల్లో మావోయిస్టులు , పోలీసుల మధ్య బీకర పోరు కోనసాగుతోంది. తాజాగా గడ్చిరోలి జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.

    గడ్చిరోలీ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చేందారు. బుధవారం తెల్లవారు జామున ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు జిల్లా ఎస్పి అంకిత్ గోయల్ తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా ఏటపల్లి తాలుకా..గట్టా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.

    బుధవారం తెల్లవారు జామున గట్టా అటవీప్రాంతంలో సుమారు 25మంది మావోయిస్టులు సమావేశం అయ్యారరనే సమాచారంతో పోలీసు బలగాలు కూంబీంగ్‌కు వెళ్లినట్టు తెలిపారు. అనంతరం పోలీసు బలగాలను చూసిన మావోలు ఎదురుకాల్పులు జరిపారని , తిరిగి పోలీసులు కాల్పులు జరపారని చెప్పారు. కాల్పుల అనంతరం సంఘటన స్థలాన్ని పరీశీలించగా గట్టా ఏరియా సభ్యుడు వినోద్ , బాంబ్రాగఢ్ ఏరియా సభ్యుడు వివేక్ మ‌ృతదేహాలు లభ్యమయినట్టు తెలిపారు. కాగా చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై 16 కేసులతో పాటు ఎనిమిది లక్షల రివార్డు ఉందని ప్రకటించారు.

    కాగా మావోయిస్టులు అటు చత్తీస్‌గఢ్ తోపాటు ఉత్తర, మధ్య భారతదేశ దండకారణ్యంలో తమ బలాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా చత్తీస్‌ఘడ్‌ను కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోలు..ఇటివలే పెద్ద ఎత్తున బద్రతా బలగాలను మట్టుబెట్టారు. అనంతంరం ఓ పోలీసు కానిస్టేబుల్‌ను కూడ కిడ్నాప్ చేసి రెండు రోజుల తర్వాత వదిలిపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం మావోలు పెద్ద ఎత్తున విధ్వంసాలకు పాల్పుడుతున్నారు. అటవీ ప్రాంతంలో పూర్తి పట్టు సాధించేందుకు పోలీసుల పై ఎక్కు పెడుతున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Maharastra news', Maoist attack

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు