news18-telugu
Updated: February 22, 2020, 3:11 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సుమారు 30 గంటల నుంచి ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని తొండమార్కా, దుర్మా, జడేకదేవాల్ అటవీప్రాంతంలో భద్రతాబలగాలు 30గంటలపాటు ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి మావోలకు చెందిన ఆయుధాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
February 22, 2020, 3:01 PM IST