హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar : అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాల కలకలం -సభ జరుగుతుండగానే వెలుగులోకి..

Bihar : అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాల కలకలం -సభ జరుగుతుండగానే వెలుగులోకి..

బీహార్ అసెంబ్లీ ఆవరణలో తాగి పారేసిన మద్యం సీసాలు

బీహార్ అసెంబ్లీ ఆవరణలో తాగి పారేసిన మద్యం సీసాలు

సాక్ష్యాత్తూ అసెంబ్లీ ఆవరణలోనే మద్యం సీసాలు కనిపించడం కలకలం రేపింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉదంతం వెలుగులోకి రావడం గమనార్హం. మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామంటూ సీఎం సహా అధికార ఎన్డీఏ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణాలు చేసిన మరుసటిరోజే..

ఇంకా చదవండి ...

సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోన్న బీహార్ లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సాక్ష్యాత్తూ అసెంబ్లీ ఆవరణలోనే మద్యం సీసాలు కనిపించడం కలకలం రేపింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉదంతం వెలుగులోకి రావడం గమనార్హం. ప్రజాస్వామిక దేవాలయమైన అసెంబ్లీ ఆవరణలో తాగి పారేసిన మద్యం సీసాలు లభ్యమైన ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ భగ్గుమంది. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తామంటూ సీఎం సహా అధికార ఎన్డీఏ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణాలు చేసిన మరుసటిరోజే అక్కడ మద్యం బాటిళ్లు కనిపించడం రచ్చకు దారితీసింది..

బీహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మద్య నిషేధానికి అధిక ప్రాధాన్యం ఇస్తోన్న ఎన్డీఏ సర్కారు.. తొలిరోజు సభలో సభ్యులందరి చేతా మద్య వ్యతిరేక ప్రమాణాలు చేయించింది. సీఎం నితీశ్ కుమార్ తోపాటు మంత్రులు, బీజేపీ, జేడీయూ ఎమ్మెల్యేలు తాము మద్య నిషేధానికి సంపూర్ణ సహకారం ఇస్తామని ప్రమాణాలు చేశారు. సీన్ కట్ చేస్తే.. సమావేశాల రెండో రోజైన మంగళవారం ఏకంగా అసెంబ్లీ ప్రాంగణంలోనే తాగిపారేసిన మద్యం సీసాలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

రోజూ మధ్యాహ్నం కోడలిని అలా చూస్తూ తట్టుకోలేక అత్తమామల అకృత్యం -అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారుఅసెంబ్లీలో తాగిపారేసిన మద్యం సీసాలు కనిపించడం చాలా తీవ్ర పరిణామమని, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు అమలు చేస్తోన్న సంపూర్ణ మద్య నిషేధం ఎంత బాగా అమలవుతుందో ఈ ఘటనతో తేటతెల్లమైందని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ‘బీహార్ వ్యాప్తంగా చాలా చోట్ల మద్యం బాటిళ్లు పట్టుపడుతూనే ఉన్నాయి. పోలీసులు మాత్రం మద్యం తాగే పేదవాళ్లను ఎడాపెడా అరెస్టు చేస్తారుగానీ మద్యం మాఫియా జోలికి మాత్రం పోరు. అసెంబ్లీలో మద్యం బాటిళ్ల కలకలానికి బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్ తక్షణమే రాజీనామా చేయాలి..’అని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.

800 year old mummy : సంచలన చరిత్రను వెలికితీశారు -పెరూలో తక్కువ వయసున్న మమ్మీ -ఈజిప్ట్ వెలుపల తొలిసారి


అసెంబ్లీలో ఖాళీ మద్యం సీసాల ఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. దీనిని సీరియస్ గా తీసుకుంటున్నామని, ఈ ఘటనపై దర్యాప్తునకు చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఆదేశించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అసెంబ్లీ స్పీకర్ అనుమతిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సీఎం సభకు తెలిపారు. బీహార్ లో గత ఆరేళ్ల నుంచి మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ దాదాపు అన్ని చోట్లా లిక్కర్ విరివిగా లభిస్తున్నట్లు రిపోర్టులు ఉన్నాయి. అధికార కూటమి నేతలే మద్యం మాఫియాను నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.

First published:

Tags: Bihar, Liquor, Liquor ban, Nitish Kumar, Tejaswi Yadav

ఉత్తమ కథలు