హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Elon Musk: ట్విట్టర్ సీఈఓకు ఎలాన్ మస్క్ వార్నింగ్.. ఇద్దరి మధ్య మెసెజ్‌ వార్.. అసలేం జరిగిందంటే..?

Elon Musk: ట్విట్టర్ సీఈఓకు ఎలాన్ మస్క్ వార్నింగ్.. ఇద్దరి మధ్య మెసెజ్‌ వార్.. అసలేం జరిగిందంటే..?

ట్విటర్ సీఈఓ, ఎలాన్ మస్క్ మధ్య మెసెజ్ వార్

ట్విటర్ సీఈఓ, ఎలాన్ మస్క్ మధ్య మెసెజ్ వార్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాను అడిగిన ఫేస్ అకౌంట్స్‌, ఇతర వివరాలను ఇవ్వనందుకు ట్విట్టర్‌తో డీల్‌ను రద్దు చేసుకున్నట్లు మస్క్ తెలిపారు.

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాను అడిగిన ఫేస్ అకౌంట్స్‌, ఇతర వివరాలను ఇవ్వనందుకు ట్విట్టర్‌తో డీల్‌ను రద్దు చేసుకున్నట్లు మస్క్ తెలిపారు. అయితే ఈ ఒప్పందం రద్దు చేయడానికి ముందు మస్క్, పరాగ్‌కు మెసేజ్‌లు పంపారు. ట్విట్టర్ లాయర్లు ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక విషయాలపై వివరాలు కోరడం సరికాదని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియా సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ సమాచారం వెల్లడైంది.

ఒప్పందం రద్దు కావడానికి ముందు ట్విటర్ కొనుగోలుకు ఎలా నిధులు సమకూరుస్తారని మస్క్‌ను ట్విట్టర్ అడిగింది. ఆ తర్వాత ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్, CFO నెడ్ సెగల్‌లకు మెసేజ్ పంపారు. ఆ వివరాలను ట్విట్టర్ దాఖలు చేసిన తాజా లా సూట్‌ (వ్యాజ్యం)లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ప్రకారం.. మస్క్ జూన్ 28న పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్‌కు మెసేజ్ పంపారు. ‘మీ లాయర్లు ఇబ్బంది పెట్టేందుకే ఈ కన్వర్జేషన్స్‌ను (ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారం) ఉపయోగిస్తున్నారు. దీన్ని ఆపేయాలి.’ అని మెసేజ్‌లో ఉంది.

ఇదీ చదవండి: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


ట్విట్టర్ ఒప్పందం నుంచి వైదొలగాలని మస్క్ తీసుకున్న నిర్ణయం టెక్ నిపుణులకు పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయన చేసిన ట్వీట్లు డీల్‌పై తనకు ఆసక్తి లేదని ముందుగానే సూచించాయి. డీల్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు మస్క్ గతంలో ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్స్‌ను గుర్తించే ప్రక్రియ, స్పామ్ బాట్స్ గురించి సమాచారాన్ని అందించడంలో ట్విట్టర్ విఫలమైందని మస్క్ ఆరోపించారు. దీంతో ఒప్పందాన్ని వెనక్కు తీసుకుంటామని బెదిరించారు. ఆ తర్వాత జులై 9న ఈ డీల్‌ క్లోజ్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే తమను ఊరించి, ఇబ్బందులు పెట్టిన ఎలాన్ మస్క్‌ను ట్విట్టర్ అంత తేలిగ్గా వదిలేసేలా కనిపించట్లేదు. ఒప్పందాన్ని రద్దు చేయకుండా ఆపడానికి ట్విట్టర్ కోర్టులను ఆశ్రయించింది. దీనిపై చట్టపరంగా పోరాడతామని తెలిపింది.

గతంలో ప్రకటించిన 44 బిలియన్ డాలర్ల డీల్ నుంచి వైదొలిగినందుకు మస్క్‌పై మైక్రో బ్లాగింగ్ సైట్ చట్టపరమైన చర్యలను తీసుకోవాలని యోచిస్తోందని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘మస్క్‌ అంగీకరించిన ధర, నిబంధనలకు అనుగుణంగా ట్రాన్సాక్షన్ పూర్తి చేయాలనేది ట్విటర్ బోర్డు నిర్ణయం. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలను కొనసాగించాలని ట్విట్టర్ యోచిస్తోంది. డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీలో మేము విజయం సాధిస్తామని నమ్ముతున్నాం’ అని టేలర్ రాశారు.

అయితే ఈ విషయంపై స్పందిస్తూ ట్విట్టర్‌లో ఎగతాళి చేసినట్లు రిప్లై ఇచ్చారు మస్క్. ‘నేను ట్విట్టర్‌ని కొనలేనని చెప్పారు. ట్విట్టర్ బాట్స్ సమాచారాన్ని ఇవ్వరు. ఇప్పుడు ట్విట్టర్‌ను కొనుగోలు చేయమని కోర్టులో బలవంతం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వారు కోర్టులో బాట్ ఇన్‌ఫో వెల్లడించాలి’ అని మస్క్ పేర్కొన్నారు.

Published by:Mahesh
First published:

Tags: Ceo, Elon Musk, Message, Twitter

ఉత్తమ కథలు