కరోనా (corona) ఏడాదిన్నరగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షలాది మందిని కోవిడ్ బలి తీసుకుంది. చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోయాయి. పలు దేశాలు లాక్డౌన్ (lockdown)లను విధించాయి. కరోనా రెండో వేవ్ (Corona Second wave) చాలా దేశాల్లో వచ్చింది. ఇక మూడో వేవ్ వస్తుందేమో అని ఇప్పటికే పలు దేశాలు ఆందోళనగా ఉన్నాయి. కాగా, కొన్ని దేశాల్లో మాత్రం ఇప్పటికే మూడో వేవ్ రాగా.. అక్కడ కరోనా నాలుగో వేవ్ కూడా తలుపుతడుతోంది. అయితే భారత్లో మాత్రం కరోనా రెండో (corona) దశ ఉధృతి అనంతరం మెల్లమెల్లగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. ఇందులో భాగంగా విద్యారంగం కూడా క్రమంగా గాడిన పడుతోంది. కొన్ని చోట్ల ఆన్లైన్ తరగతులు (Online classes) కూడా నిర్వహిస్తున్నా చాలావరకు పాఠశాలలు (schools) ప్రారంభమయ్యాయి. అయితే కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహమ్మారి మాత్రం విద్యార్థులను (students), ఉపాధ్యాయులను వెంటాడుతూనే ఉంది.
మహారాజా సవాయి మాన్సింగ్ గురుకులంలో ..
తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur)లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 11 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ (covid positive)గా నిర్ధారణ అయింది. దీంతో విద్యాశాఖ అధికారులు (education officials) అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు. కొన్ని రోజుల క్రితం జైపూర్లోని మహారాజా సవాయి మాన్సింగ్ గురుకులంలో కూడా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు (corona cases) బయటపడిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ మొదటివారంలో..
కరోనా ప్రభావంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు పాఠశాలలు, కళాశాలలు (colleges) మూత పడిన సంగతి తెలిసిందే. రాజస్థాన్లో సెప్టెంబర్ మొదటివారంలో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు (educational institutions) తెరచుకున్నాయి. మొదట 50 శాతం విద్యార్థులతో నిర్వహించగా దీపావళి తర్వాత 100 శాతం విద్యార్థులతో తరగతులకు అనుమతినిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటి నుంచే పాఠశాలల్లో వరుసగా విద్యార్థులు కరోనా (corona cases) బారిన పడుతున్నారు. ఈ సందర్భంగా స్కూళ్లలో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, టీచర్లందరూ వ్యాక్సిన్ (vaccine) తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.
ఇటీవలె తెలంగాణలో..
రెండు రోజుల క్రితమే తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో మరోసారి కరోనా విజృంభించింది. ఖమ్మంలోని గురుకుల స్కూళ్లో ఏకంగా 27 మందికి కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. గురుకుల పాఠశాలలో 13 మందికి కాలేజీలో మరో 14 మందికి కరోనా పాజీటివ్గా తేలింది. మరోవైపు తిరుమల వేదపాఠశాలలోనూ మార్చిలో కరోనా కేసులు (corona cases) వెలుగుచూశాయి. ఒక్కసారిగా పాఠశాలలో విద్యార్థులు అస్వస్తతకు గురికావడంతో వేదపాఠశాలకు టీటీడీ అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో 357 మంది విద్యార్థులు సొంతగ్రామాలకు వెళ్లిపోయారు. మార్చి 10న వేద పాఠశాలలోని 57 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona cases, Rajastan, School