మరికాసేపట్లో కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో మరికొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. సదానందగౌడ, రవిశంకర్ ప్రసాద్, తావర్‌చంద్ గెహ్లాత్, రమేశ్ పోక్రియాల్, హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్, సంతోష్ కుమార్ గాంగ్వర్, బూబుల్ సుప్రియో, దోత్రే సంజయ్ శ్యామ్ రావ్, రతన్ లాల్ కటారియా, ప్రతాప్ చంద్ర రాజీనామా చేసిన మంత్రుల జాబితాలో ఉన్నారు. ప్రధాని మంత్రి విజ్ఞప్తి మేరకు వీరి రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆమోదించారు. వీరి రాజీనామాలకు ఆమోదం లభించడంతో వీరి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. కొత్త, పాత వారితో కలుపుకుంటే మొత్తం 43 మంది మరికాసేపట్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
ప్రస్తుతం కేబినెట్లో సహాయమంత్రులుగా కొనసాగుతున్నకిరణ్ రిజుజు, కిషన్ రెడ్డి, హర్ దీప్ సింగ్ పూరి, అనురాగ్ ఠాగూర్ వంటి వారికి ప్రమోషన్ లభించనుంది. 22 మంది కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.
1. నారాయణ్ రాణె
2. సర్బానంద సోనోవాల్
3. వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాధిత్య సింధియా
5. రామచంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్వినీ వైష్ణవ్
7. పశుపతి కుమార్ పరాస్
8. కిరణ్ రిజుజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పూరి
11. మన్సుఖ్ మండవియా
12. భూపేంద్ర యాదవ్
13. పురుషోత్తం రూపాలా
14. కిషన్ రెడ్డి
15. అనురాగ్ ఠాకూర్
16. పంకజ్ చౌదరి
17. అనుప్రియ సింగ్ పటేల్
18. సత్యపాల్ సింగ్ భగేల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. శోభా కరంద్లాజె
21. భాను ప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శన విక్రమ్ జర్దోష్
23. మీనాక్షి లేఖి
24. అన్నపూర్ణ దేవి
25. నారాయణస్వామి
26. కౌశల్ కిశోర్
27. అజయ్ భట్
28. బీఎల్ వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహాన్ దేవుశిష్
31. భగవంత్ కుబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. సుశ్రి ప్రతిమా భౌమిక్
34. సుభాష్ సర్కార్
35. భగవత్ కిషన్ రావు కరాడ్
36. రాజ్‌కుమార్ రంజన్ సింగ్
37. భారతి ప్రవీణ్ పవార్
38. బిశ్వేశ్వర్ టుడా
39. శంతను ఠాగూర్
40. ముంజపర మహేంద్ర భాయ్
41. జాన్ బార్లా
42. ఎల్ మురుగన్
43. నిషిత్ ప్రమాణిక్
మోదీ కొత్త టీమ్‌లో యువ నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మహిళలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసినట్లు సమాచారం. బీసీలకు 27, ఎస్టీలకు 17, ఎస్టీకి 7 మంత్రి పదవులు కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇద్దరు బుద్దిస్ట్‌లు, ఒక ముస్లిం, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్‌కు కలిపి మొత్తం 5 మంత్రి పదవులను మైనారిటీలకు కేటాయించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.