Elephant cutting : ఏనుగును 15 ముక్కలుగా కట్ చేశారు... ఇదే కారణం అంటున్న ఫారెస్ట్ అధికారులు

Elephant cutting : ఏనుగును 15 ముక్కలుగా కట్ చేశారు...

Elephant cutting : గతంలో ఎన్నడు చోటు చేసుకుని హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఏనుగును ముక్కలు కోసి మోసుకుని వెళ్లారు. అయితే ఎనుగు అధిక బరువును మోయలేకనే కోసి ముక్కలు కోశామని అధికారులు చెబుతున్నారు.

  • Share this:
    తమిళనాడులోని ( tamilnadu ) నీలగిరిలోని మాళవన్ చేరంపాడి గత వారం రోజుల క్రితం ఓ ఏనుగు ( elephant ) బురదలో కూరుకుని మ‌ృతి చెందింది. అయితే అలస్యంగా గుర్తించిన ఫారెస్ట్ (farest ) అధికారులు అతి కష్టం మీద దాన్ని బయటకు తీశారు. సుమారు పదిహేను వందల కిలోల అధిక బరువు ఉండడంతో అక్కడే ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఫారెస్ట్ అధికారులకు స్థానిక గ్రామస్థుల నుండి నిరసనలు ఎదురయ్యాయి. ఏనుగు ఖననం చేసే ప్రాంతంలో ఊరు ప్రజలు వాడుకునే మంచినీటి బావి ఉండడడంతో వారు వ్యతిరేకించారు.. ఏనుగును అక్కడే పూడ్చి పెట్టడడం వల్ల భవిష్యత్‌లో బావి ( water ) నీళ్లు కలుషితం అవుతాయని చెప్పారు.

    దీంతో ఏనుగును అక్కడి నుండి తరలించి అటవీ ప్రాంతంలో ఖననం చేయాలని నిర్ణయించారు. అయితే అన్ని కిలోల బరువున్న ఏనుగును తరలించడం సాధ్యం కాకపోవడంతో ఏం చేయాలో తోచలేదు.. దీంతో ఏనుగును పార్టులుగా కట్ చేసి ( cutting ) విడివిడిగా మోసుకు పోవాలని నిర్ణయించారు. దీంతో చినిపోయిన ఏనుగును ముక్కలుగా కోశారు. ఇలా పదిహేను ముక్కలుగా ఏనుగును కత్తిరించి మూటల్లో తరలించారు.

    ఇది చదవండి :  బాత్రూం కోసమని వెళ్లి పోలీసుల కళ్లు గప్పాడు.. తీరా చూస్తే... ?

    అయితే ఇలా ఏనుగును ముక్కలుగా కట్ చేసి తరలించడం మొదటి సారి అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. తప్పని సరై పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాలో ( social media ) వైరల్ మారడంతో పలువురు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇది చదవండి : దివ్వాంగురాలు ఇంటికి మధ్యాహ్నం పూట ఒక్కడే.. వెళ్లాడు.. కట్ చేస్తే.. ?

    Published by:yveerash yveerash
    First published: