హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Electric Vehicles: ఇక అన్ని.. ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌.. ప్ర‌భుత్వ సంచ‌లన నిర్ణ‌యం

Electric Vehicles: ఇక అన్ని.. ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌.. ప్ర‌భుత్వ సంచ‌లన నిర్ణ‌యం

రాబోయే కాలంలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ రెండు కొత్త తయారీ ప్లాంట్లను ప్రారంభించనుంది. హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్ఖోడాలో ఈ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం కంపెనీ 11,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2025లో తొలి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న కంపెనీ.. కొంత కాలం తర్వాత రెండో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

రాబోయే కాలంలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ రెండు కొత్త తయారీ ప్లాంట్లను ప్రారంభించనుంది. హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్ఖోడాలో ఈ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఇందుకోసం కంపెనీ 11,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2025లో తొలి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న కంపెనీ.. కొంత కాలం తర్వాత రెండో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

Electric Vehicle | వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకొంది. తన పాత పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను రద్దు చేసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకొంది. ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులు వినియోగించేందుకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) ఇటీవల 12 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ (Delhi) ప్రభుత్వం తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకొంది. తన పాత పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను రద్దు చేసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకొంది. ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులు వినియోగించేందుకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) ఇటీవల 12 ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) ను కొనుగోలు చేసినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది. "స్క్రాపింగ్ కోసం జీవితకాలం పూర్తి చేసిన వాహనాలను గుర్తించి పంపే ప్రక్రియను కూడా మేము ప్రారంభించాము" అని GAD సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

Assembly Elections 2022: పంజాబ్ లో 64 శాతం పోలింగ్.. యూపీ మూడో దశలో 60శాతం ఓటింగ్

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal) ఆర్డర్ ప్రకారం, ఢిల్లీలో వరుసగా 10, 15 సంవత్సరాల కంటే పాత డీజిల్ మరియు పెట్రోల్ (Petrol) వాహనాల వినియోగాన్ని నిషేధించారు. ఆగస్టు 2020లో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రారంభించిన తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్ర‌భుత్వ కంపెనీలు, కార్యాల‌యాల్లో ఇంధ‌న వాహ‌నాల‌కు బ‌దులుగా ఎల‌క్ట్రిక్ వెహికిల్‌ల‌ను ప్రారంభించారు.

పెరుగుతున్న ధ‌ర‌ల నేప‌థ్యంలోనూ ఈ నిర్ణ‌యం స‌రైంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ విష‌యాన్ని గత ఏడాది ఫిబ్రవరిలోనే ఢిల్లీ ప్ర‌భుత్వం దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చింది. తాజాగా “ఢిల్లీ ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగిస్తాయి. 2,000కు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు.

Regional Alliance: బీజేపీని నిలువ‌రించగ‌ల‌రా.. ప్రాంతీయ కుట‌మి బ‌లం, బ‌ల‌హీన‌త ఏమిటీ?

GAD ఢిల్లీ సెక్రటేరియట్ సమీపంలోని లాట్‌లో పార్క్ చేసిన 0001 వంటి VIP సిరీస్ రిజిస్ట్రేషన్ నంబర్‌లతో అనేక పాత వాహనాలను భర్తీ చేయడానికి అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. "ఈ వాహనాలు రద్దు చేయబడినప్పటికీ, డిపార్ట్‌మెంట్ కొనుగోలు చేయబోయే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వాటి VIP రిజిస్ట్రేషన్ నంబర్‌లు అలాగే దాచుతారు. అని అధికారి తెలిపారు. ఢిల్లీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద, 12 ఫోర్-వీలర్ మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం అందించే కొనుగోలు మరియు స్క్రాపింగ్ ప్రోత్సాహకాలను పొందేందుకు అర్హులు.

First published:

Tags: Delhi, Electric Car, Latest Technology

ఉత్తమ కథలు