Home /News /national /

ELECTRIC CARS THINGS YOU NEED TO KNOW TO CONVERT YOUR PETROL OR DIESEL CARS INTO AN ELECTRIC VEHICLE SK

Electric Cars: పాత కార్లను ఎలక్ట్రిక్‌గా మార్చడం ఎలా? అందుకు ఎంత ఖర్చవుతుంది? పూర్తి వివరాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Electric cars: ఎలక్ట్రిక్ కారుగా మార్చేేందుకు మీరు 5 లక్షలు ఖర్చు పెడితే.. ఆ డబ్బులు 4 ఏళ్ల 8 నెలల్లోనే వెనక్కి వచ్చేస్తాయి. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జీ చేస్తే.. 78 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది.

  ప్రస్తుతం మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) కు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతుండడంతో పాటు వాయు కాలుష్య నియంత్రణ (Air Pollution Control) కోసం ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తుండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి కొత్త కొత్త కంపెనీలు వచ్చి ఆఫర్లు, ఫీచర్లతో జనాలను ఊరిస్తున్నాయి. ఐతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ ధరలను చూసి సామాన్య ప్రజలు కాస్త వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినప్పటికీ ఇంకా ధరలు ఎక్కువగానే ఉన్నాయని వాపోతున్నారు. ఐతే ఇలాంటి వారికి ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) బంపర్ ఆఫర్ ఇచ్చింది. పాత డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చుకునే అవకాశాల్ని కల్పిస్తోంది.

  ఢిల్లీలో 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం అమల్లో ఉంది. ఐతే వాటిని ఎలక్ట్రిక్ కార్లుగా మార్చి.. మళ్లీ నడుపుకోవ్చని చెబుతోంది. మరి పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా మార్చుతారు? డీజిల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటర్‌తో ఎలా భర్తీ చేస్తారు? దానికి ఎంత ఖర్చవుతుంది?

  ఒప్పో సంచలనం.. రూ. 60 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంఛ్ ఎప్పుడంటే..

  ముందుగా మీ కారుకు డీజిల్ లేదా పెట్రోల్ ఇంజిన్‌ను తొలగిస్తారు. అక్కడ ఏర్పడిన ఖాళీ స్థలంలో ఎలక్ట్రిక్ మోటర్, హైవోల్టేజ్ వార్నింగ్ సర్క్యూట్, కంట్రోల్ యూనిట్‌ను అమర్చుతారు. సాంకేతిక నిపుణులు హైవోల్టేజ్, లో ఓల్టేజ్ సర్య్యూట్‌లను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు కంట్రోల్, ట్రాన్స్‌మిషన్ యూనిట్లను కన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చడంలో కారు ఎలక్ట్రికల్స్‌ని తిరిగి ఇన్‌స్టాల్ చేయడమే ప్రధానమైన ప్రక్రియ.

  Shopee: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీ ఇస్తున్న షాపీ... రోజూ లక్ష ఆర్డర్లు

  డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చేటప్పుడు పాత మెకానికల్ భాగాలను తొలగిస్తారు. అంటే ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, ఇంజిన్‌కు శక్తిని సరఫరా చేసే కేబుల్స్‌ను తొలగించి.. వాటి స్థానాల్లో మోటర్, కంట్రోలర్, రోలర్, బ్యాటరీ వంటి ఎలక్ట్రిక్ భాగాలను అమర్చుతారు. ఈ పని పూర్తి చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టవచ్చు. ఈ భాగాలన్నీ కారు బానెట్ కింద స్థిరంగా ఉంటాయి. బూట్ స్పేస్ మాత్రం పూర్తిగా ఖాళీగా ఉంటుంది. దానిని ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ తొలగించిన తర్వాత దాని క్యాప్‌ వద్ద చార్జింగ్ పాయింట్‌ను అమర్చుతారు. కేవలం ఈ భాగాలు మాత్రమే మారుతాయి. కారు మోడల్‌లో ఎలాంటి మార్పులు చేయరు. ఇంతకు ముందు ఎలా కనిపించిందో.. ఆ తర్వాత కూడా అలాగే ఉంటుంది.

  డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ఏజెన్సీలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఐతే డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చేందుకు రూ.4 నుంచి 6 లక్షల వరకు ఖర్చవుతుంది. పెట్రోల్ కారును ఎలక్ట్రిక్‌గా మార్చడం చాలా ఈజీ అని అందరు అనుకుంటారు. కానీ ఒక పెట్రోల్ కారును CNGకి మార్చడం కంటే..ఎలక్ట్రిక్ కారుగా మార్చడమే చాలా సంక్షిష్టమైన ప్రక్రియ. కానీ ఒక్కసారి ఎలక్ట్రిక్ కారుగా మారిన తర్వాత మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గిపోతాయి. ఎలక్ట్రిక్ కారుగా మార్చేేందుకు మీరు 5 లక్షలు ఖర్చు పెడితే.. ఆ డబ్బులు 4 ఏళ్ల 8 నెలల్లోనే వెనక్కి వచ్చేస్తాయి. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జీ చేస్తే.. 78 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు మీరు డీజిల్, పెట్రోల్ కొట్టించాల్సిన అవసరం లేకపోవడంతో.. ఆ డబ్బులన్నీ మిగిలినట్లే.

  LIC Policy: రోజూ రూ.200 దాచుకుంటే రూ.28 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

  ఢిల్లీలో దాదాపు 38 లక్షల పాత వాహనాలున్నాయి. ఇందులో 35 లక్షల పెట్రోల్, 3 లక్షల డీజిల్ వాహనాలున్నాయి. సుప్రీంకోర్టు, ఎన్జీటీ (National Green Tribunal) ఆదేశాల ప్రకారం.. దేశ రాజధానిలో 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలపై నిషేధం అమల్లో ఉంది. ఆ వాహనాలు రోడ్లపై తిరిగేేందుకు వీళ్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 ఏళ్లు పూర్తి చేసుకున్న డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతిచ్చింది.

  ఐతే ఇప్పటికే ఉన్న డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చాలా? లేదంటే కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటే బాగుంటుందా? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చేందుకు తక్కువ ఖర్చే అవుతుంది. అదే కొత్త కారును కొనాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. కానీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లపై ఢిల్లీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. పాత కార్లను ఎలక్ట్రిక్‌గా మార్చితే ఇది వర్తించదు. అంతేకాదు కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటే కంపెనీ నుంచి సర్వీస్ లభిస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ల వరకు వ్యారంటీ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వారే చూసుకుంటారు. అందుకే ఎలక్ట్రిక్ కార్ల విషయంలో అన్ని అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Delhi, Diesel, Electric cars, Electric vehicle, Technology

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు