Viral Video: కరోనా టీకా వేసుకున్నాక ఒంట్లో కరెంట్.. అక్కడ బల్బు పెడితే ఫుల్ లైట్..

కరోనా టీకా వేసుకున్నాక ఒంట్లో కరెంట్

కరోనా టీకా వేసుకున్నాక ఎవరికైనా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ ఈ అన్నాచెల్లెల్లకు మాత్రం ఒంట్లో కరెంట్ పుడుతోంది. టీకా వేసిన చోట బల్బు పెడితే జిగేల్‌మని వెలిగిపోతోంది.

  • Share this:
    కరోనా మహమ్మారిను ఎదుర్కోవాలంటే అందరూ టీకాలు వేసుకోవాలి. డాక్టర్ల నుంచి ప్రభుత్వాల వరకు.. అందరూ చెబుతున్న మాట ఇదే. టీకా వేసుకుంటే కరోనా వైరస్‌ను తిప్పికొట్టేలా.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. కరోనా రాకుండా అవి అడ్డుకుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ వీరికి మాత్రం కరోనా టీకా వేసుకున్నాక ఒంట్లో కరెంటు పుడుతోంది. శరీరం బుల్లి విద్యుత్ కేంద్రంగా మారిపోయింది. భుజంపై వ్యాక్సిన్ వేసుకున్న చోట ఎలక్ట్రిక్ బల్బు పెడితే.. అది జిగేల్‌మని వెలుగుతోంది. ఏదో ప్లగ్‌లలో పెట్టినట్లుగా ఇళ్లంతా వెలుతురు ఇస్తోంది. అవును ఇది నిజం. కర్నాటకలోని హుబ్లీలో ఈ వింత జరిగింది.

    హుబ్లీకి చెందిన సుమంత్, దీక్ష అక్కాచెల్లెళ్లు. ఇరువురి వయసు ఇంచుమించు 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఇటీవల వీరిద్దరు కరోనా టీకాలు వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సుమత్ ఓ ఎల్‌ఈడీ బల్బుతో ఏవేవో ప్రయోగాలు చేశాడు. ఆ సమయంలో వ్యాక్సిన్ వేసిన చోట బల్బు తాకగానే అది వెలిగిపోయింది. దానిని చూసి సుమంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ తిన్నారు. మళ్లీ శరీరంలోని ఇతర భాగాలపై బల్బును పెడితే వెలగడం లేదు. సరిగ్గా సూది దిగన చోట పెడితేనే వెలుగుతోంది. అది కూడా చిన్న బల్బు కాదు. మన ఇళ్లల్లో వాడే 9వాట్స్ బల్బు. వీరిద్దరు బల్బును వెలిగిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.



    ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలి వస్తున్నారు. మా కోసం ఒక్కసారి బల్బు వెలిగించవా.. అని అడుగుతున్నారు. ఐతే మరికొందరు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇది వింత కాదు పబ్లిసిటీ స్టంట్ అని సెటైర్లు వేస్తున్నారు. అది రిమోట్‌తో ఆపరేట్ చేయగలిగే చార్జింగ్ బల్బు అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే కరోనా టీకాకు, కరెంటు‌కు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదైమైనా ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. నెటిజన్లు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: