Election Rallies ర్యాలీలపై నిషేధం ..సీఈసీ.. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఓకేనా...?

కేంద్ర ఎన్నికల సంఘ కార్యాలయం

CEC ORDER : ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై కేంద్ర ఎన్నికల కమీషన్ అలర్డ్ అయింది..విస్తృతంగా విజృంభిస్తున్న కరోనా కారణంగా ర్యాలీలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు

  • Share this:
కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసి ముందుజాగ్రత్ర చర్యలు చేపట్టింది. కరోనా విపరీతంగా విజృస్తున్న నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతన్న రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. అయితే దేశంలో పశ్చిమ బెంగాల్ చివరి విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా ..మరోవారం రోజుల్లో ఫలితాలు రానున్నాయి. దీంతో ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం విధించింది.

కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు ఎన్నికల విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. కాగా దేశంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే..అయితే పశ్చిమ బెంగాల్ లో చివరి విడత ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా మే మూడున ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఆయా రాష్ట్రాల్లో కూడ ఉప ఎన్నికలు నిర్వహించారు.

ఇక తెలంగాణలో కూడ నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు ఏపీలో తిరుపతి పార్లమెంట్‌కు ఉపఎన్నికలు నిర్వహించగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ సైతం మిని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఈనెల ముప్పైన ఎన్నికలు జరగనున్నాయి. మూడవ తేదినే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడ వెలువడనున్నాయి. కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం ప్రకారం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిషేధించారు. అయితే.. కేంద్ర ఎన్నికల కమీషన్ని నిర్ణయాన్ని బట్టి రాష్ట్రంలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలను కూడ నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా తెలంగాణలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలను నిషేధించాలని ఆయా పార్టీల నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ తోపాటు బీజేపీ సైతం ఎన్నికల నిర్వహాణపై గవర్నర్ తమిళిసైకి లేఖలు సైతం రాశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడ కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టుకు వెళ్లింది. దీంతో ఎన్నికలను వాయిదా వేయకపోయినా కనీసం విజయోత్సవ ర్యాలీలు నిషేధించడం వల్ల కొంతమేరకు కరోనా కట్టడిని అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనల అమలు విషయంలో మద్రాస్‌ హైకోర్టు ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ కేసులు కొనసాగుతున్నప్పటికీ ర్యాలీలు, రోడ్‌షోల్లో ఆంక్షల అమలులో పూర్తిగా విఫలమైందని, ‘కరోనా సెకండ్‌ వేవ్‌కు ఏకైక కారణం ఈసీ అని, ఇందుకు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి సైతం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు పాటించకుండా వ్యవహరంచడంపై ఆగ్రహం కూడ వ్యక్తం చేసింది.
Published by:yveerash yveerash
First published: