• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • ELECTION STRATEGIST IMPLEMENTING ANDHRA PRADESH PLAN IN WEST BENGAL TO BENEFIT MAMATA BANERJEE AK

Prashant Kishor: బెంగాల్‌ ఎన్నికల్లో ‘ఆంధ్రప్రదేశ్’ వ్యూహం.. ప్రశాంత్ కిశోర్ ప్లాన్

Prashant Kishor: బెంగాల్‌ ఎన్నికల్లో ‘ఆంధ్రప్రదేశ్’ వ్యూహం.. ప్రశాంత్ కిశోర్ ప్లాన్

ప్రశాంత్ కిశోర్( ఫైల్ ఫోటో)

Prashant Kishor: ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఏ రకంగా తన వ్యూహాలతో మమతా బెనర్జీని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా బెంగాల్‌ను తమ సొంతం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఏ రకంగా తన వ్యూహాలతో మమతా బెనర్జీని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఇతర అంశాలతో పాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుని వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రశఆంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే బెంగాల్‌లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఓట్లను సాధించేందుకు సాధనంగా ఉపయోగించనుంది. కోల్‌కతాలోని ఇప్పటికే ఇందుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మొదలపెట్టారు. 294 నియోజకవర్గాల్లోనూ ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

    అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం సోషల్ మీడియాను ఏ రకంగా వినియోగించుకోవాలనే దానిపై శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు మీడియా సెల్ హైలెట్ చేయనుంది. ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందించేందుకు శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌కు ఫేస్‌బుక్‌లో 294 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఫేజీలు ఉన్నాయి. ఇందులో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు.

    ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందిస్తున్న పథకాలు, స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి వంటి అంశాలను అందులో ప్రచారం చేస్తున్నారు. బెంగాల్ సంస్కృతి వంటి అంశాల ప్రచారానిక సైతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతను తమ వైపు ఆకట్టుకోవడానికి పబ్లిక్ మీటింగ్లు, రోడ్ షోలు వంటి అంశాలు ఎక్కువగా ప్రభావం చూపవని భావిస్తున్న టీఎంసీ.. ఇందుకోసం సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఈసారి ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాను ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు