Home /News /national /

ELECTION RESULTS 2019 LIVE ODISHA NAVEEN PATNAIKS BJD RETAINS POWER FOR THE 5TH TIME NK

ఒడిశాలో ఐదోసారి సీఎంగా నవీన్ పట్నాయక్... BJD సక్సెస్ సీక్రెట్ ఇదీ...

నవీన్ పట్నాయక్

నవీన్ పట్నాయక్

Odisha Lok Sabha Election Results 2019 : వరుసగా ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం ఆషామాషీ కాదు. ఇదెలా సాధ్యమైంది? నవీన్ పట్నాయక్ ఏమంటున్నారు.

ఒడిశాలో వరుసగా ఐదోసారి ఘన విజయం సాధించింది సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్. రాష్ట్రంలో మొత్తం 146 అసెంబ్లీ స్థానాలకూ, 21 లోక్ సభ స్థానాలకూ నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం అధికార బిజూ జనతాదళ్ (BJD)... ఐదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతోంది. బీజేడీ 74 అసెంబ్లీ స్థానాలు సాధించి... మరో 38 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. 21 లోక్ సభ స్థానాల్లో... బీజేడీ 4 సీట్లు గెలిచి... మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫొని తుఫాను వల్ల ఓ దశలో ఓటింగ్ శాతం తగ్గినా... అధికార పార్టీతోనే తాము ఉన్నామని ప్రజలు మరోసారి నిరూపించారు. ఫలితంగా ఐదోసారి నవీన్ పట్నాయక్ ఒడిశాకు సీఎం కాబోతున్నారు. ఈ సందర్భంగా న్యూస్18 ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు మీకోసం.

ప్రశ్న - వరుసగా ఐదోసారి ఒడిశా సీఎం కాబోతున్నారు. దేశంలో ఇలాంటి రికార్డు సాధించిన వారిలో మీరు మూడోవారు. ఎలా అనిపిస్తోంది?
నవీన్ పట్నాయక్ - ప్రజలు నన్ను మరోసారి ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బీజేడీ నేతలు, కార్యకర్తలకు థాంక్స్ చెబుతున్నాను. వారి హార్డ్ వర్క్, కృషి వల్లే, ప్రజా స్పందన వల్ల మేం తిరిగి అధికారంలోకి రాగలిగాం.

ప్రశ్న - జనరల్‌గా నాలుగుసార్లు పాలించాక, ఐదోసారి గెలవడం చాలా కష్టం. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఓటర్లు కూడా ఒకటే ప్రభుత్వాన్ని చూసి విసుగు చెందుతారు. కానీ మీ విషయంలో అలా జరగలేదు. ఐదోసారి కూడా మీరు 100కు పైగా సీట్లు సాధిస్తున్నారు....
నవీన్ పట్నాయక్ - కారణం మేం చేపడుతున్న చక్కటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే. అవి విజయవంతం అవుతున్నాయి. ప్రయోజనం కలిగిస్తున్నాయి.

ప్రశ్న - లోక్ సభ ఫలితాలను చూస్తే, మీ పార్టీకి వచ్చినవి తక్కువేనని అనిపిస్తోందా? అసంతృప్తిగా ఉందా?
నవీన్ పట్నాయక్ - మొత్తం 21 లోక్ సభ స్థానాల్లో ఇదివరకు మేం 20 సాధించాం. ఇప్పుడు కూడా తగ్గినా కొంతవరకూ గెలవగలుగుతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో.

ప్రశ్న - ప్రజలు లోక్ సభకూ, అసెంబ్లీకీ వేర్వేరు ఆలోచనలతో ఓట్లు వేస్తున్నారని అనిపిస్తోందా? తేడా ఐదు శాతం ఓట్లే అయినా, వాళ్లు తేడాను చూపించగలుగుతున్నారా?
నవీన్ పట్నాయక్ - అలా అనిపిస్తోంది. కావచ్చు కూడా.

ప్రశ్న - ఈసారి ఒడిశాలో ఇలా ఎందుకు జరుగుతోంది?
నవీన్ పట్నాయక్ - దేశవ్యాప్తంగా మోదీ వేవ్ ఉంది. ఒడిశాలో కూడా పార్లమెంట్ ఎన్నికలపై దాని ప్రభావం కనిపిస్తోంది.

ప్రశ్న - అది కొద్దిగా ఉందా, బాగా ఉందా?
నవీన్ పట్నాయక్ - ఒడిశాలో కొంత ఉంది.

ప్రశ్న - మీరు సీఎంగా ప్రమాణం చేయగానే మీ మొదటి ప్రాధాన్య అంశం ఏంటి? మీరు చాలా హామీలు ఇచ్చారు. కాలియా మనీ ఇస్తారా?
నవీన్ పట్నాయక్ - కాలియా మనీ (రైతులకు సహాయ నిధి) ఇవ్వడమే మొదటి ప్రాధాన్యం. ప్రచారంలో అదే చెప్పాం.

ప్రశ్న - ఒడిశాకు సంబంధించి మీ విజన్ (భవిష్యత్ ఆలోచన) ఏంటి?
నవీన్ పట్నాయక్ - ఒడిశా అభివృద్ధిపై మేం రెట్టింపు దృష్టిపెడతాం.

ప్రశ్న - కేంద్రంలో NDA తిరుగులేని విజయం సాధించింది. కేంద్రంతో మీ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?
నవీన్ పట్నాయక్ - తెల్లారే ఫోన్ చేసి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పాను. ఒడిశా అభివృద్ధి కోసం నిర్మాణాత్మక సహకారం ఉంటుంది.

ప్రశ్న - ఎన్నికలప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది. మీకూ అలా అనిపించిందా.
నవీన్ పట్నాయక్ - మాకు అలా అనిపించలేదు. మేం ప్రారంభం నుంచే చక్కగా పాలిస్తున్నాం.

ప్రశ్న - మీరు రిలాక్స్ ఎలా పొందుతారు?
నవీన్ పట్నాయక్ - రిలాక్స్ అయ్యే టైమ్ లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి, పని మొదలుపెట్టాలి.

 

ఇవి కూడా చదవండి :

ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?

 

ఆ 23కి ఈ 23తో చెక్ పెట్టారా... మే 23న వైసీపీ ఇరగదీసిందిగా...

యువతిపై రేప్... ఇల్లు అద్దెకు కావాలని వచ్చి...
First published:

Tags: Coastal Odisha Lok Sabha Elections 2019, Naveen Patnaik

తదుపరి వార్తలు