వచ్చే ఏడాది మార్చ్‌లో ఉత్తర ప్రదేశ్ (Uttarpradesh)లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే అప్పుడే రాష్ట్రంలో ఎన్నిక సందడి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి యోగీ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో కొన్ని సర్వేలు యోగీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావొచ్చని అంచానాలను వెల్లడించాయి. రాజకీయంగా.. సామాజికంగా ఎన్నో వైవిధ్యాలకు ఉత్తర్ ప్రదేశ్ చిరునామా.. ముస్లిం జనాభా.. కుల సమీకరణాలు.. బహుముఖ పోటీ మధ్య రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ యూపీ ప్రారంభించింది. ఎన్నికల కోసం రాష్ట్రంలో కేంద్ర మంత్రులను ఇన్‌చార్జులగా నియమింఇంది. రీజియన్ల వారీగా ప్రచార కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని ప్రారంభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోరాష్ట్రంలో భాజపా అఖండ విజయం సాధిం చిన విషయం తెలిసిం దే. వచ్చే ఏడాది జరగబోయే ఎన్ని కల్లోనూ జయకేతనం ఎగురవేసేందుకు కాషాయ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది అనడంలో సందేహం లేదు.
2017 ఫలితాలు..
ఉత్తర్ ప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017లో ఇక్కడ బీజేపీ 312 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. రెండో స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ 47 స్థానాలు సాధించింది. బీఎస్పీ 19 స్థానాలు గెలువగా కాంగ్రెస్ కేవలం 7 సీట్లకే పరిమితమైంది.
కాంగ్రెస్ ఒంటరి పోరు..
2022లో జరిగే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఒంటరి పోరు చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఈ సారి కాంగ్రెస్ తరుఫున సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ఉండవచ్చని అందరూ భావిస్తారు. కాంగ్రెస్ గెలవాలనుకుంటే ఒంటరిగానే గెలుస్తుందని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పార్టీ బలాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తోందని అర్థం అవుతుంది. ఇది ఎవరి లబ్ధి చేకూర్చనుందో ఇప్పడే చెప్పలేం.
బీఎస్పీ పరిస్థితి..
ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి ప్రకటించారు. దళితులు, అగ్రవర్ణాల కాంబినేషన్‌లలో గతంలో మాయావతి అధికారంలోకి వచ్చారు. ఈ సారి ఆ ఫార్ములనే నమ్ముకొన్నారు. అయితే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ వీటిపై ఇంకా ఇద్దరూ స్పష్టతనివ్వలేదు.
పోటీకి దిగని అఖిలేశ్.. పొత్తుతో ముందుకు
గత ఎన్నికల్లో బీజేపీ కారణంగా అధికారానికి దూరమైంది సమాజ్‌వాదీ పార్టీ. ఈ నేపథ్యంలో ఈసారి అఖిలేశ్ యాదవ్ కొత్త సాహసానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సారి తాను పోటీ చేయనని ప్రకటించారు. పార్టీని ముందుడి నడిపిస్తానని తెలిపారు. అంతే కాకుండా మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్ కుమారుడైన అజిత్‌సింగ్ ఏర్పాటు చేసిన రాష్ట్రీయ లోక్‌దళ్‌తో ఆయన పొత్తు పెట్టుకొన్నారు. ఇంకా చిన్న పక్షాలతో కలిసి కూటమి ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
Bandi Sanjay: వద్దన్న చోటే.. సీఎం కూర్చొని ధర్నా చేసేలా చేశాం: బండి సంజయ్
ఉనికి కోసం ఎంఐఎం..
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలకు పోటీ చేస్తామని ఏఐఎంఐఎం ఇప్పటికే ప్రకటించింది. ముస్లిం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ పెంచుకోవడానికి ఎంఐఎం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీని ద్వార ఓట్లు పొలరైజ్ అయితాయని ఇతర పక్షాలు వాదిస్తున్నాయి. ఎంఐం పోటీతో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌కు ముస్లిం ఓట్లు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తాను ముస్లిం నాయకుడిని కానని, ములాయం, లాలూ, మమతా బెనర్జీలాంటి వారే ముస్లిం నాయకులని ఓవైసీ ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ నాయకులు ముస్లిం ఓట్లు తీసుకొన్నారే తప్ప ఏం చేయలేదని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Elections, Uttar pradesh