హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Election For Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు తేదీ ఖరారు... ఎప్పుడంటే..

Election For Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికకు తేదీ ఖరారు... ఎప్పుడంటే..

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (ఫైల్ ఫోటో)

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (ఫైల్ ఫోటో)

దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా తేదీ ఖరారైంది. ఆగస్టు 6న ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.

వచ్చే నెలలో రాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు జరగనుండగా.. ఆ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి(Vice President Elections) ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం (Election Comission) షెడ్యూల్ ప్రకటించింది. జులై 5న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు కోసం జులై 19న చివరి తేదీ. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రా‌ చేసుకునేందుకు ఈ నెల 22న చివరి తేదీ. పోటీ అనివార్యమైతే ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) పదవీకాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి కావడానికి ఒక వ్యక్తి తప్పనిసరిగా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అతను లేదా ఆమె తప్పనిసరిగా కనీసం 20 మంది ఓటర్లు ప్రతిపాదకులుగా, ద్వితీయులుగా నామినేట్ చేయబడాలి. ఒక వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండి, 35 ఏళ్లు పూర్తి చేసి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యునిగా ఎన్నిక కావడానికి అర్హత పొందితే తప్ప ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోలేరు.

సదరు వ్యక్తి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏదైనా సబార్డినేట్ లోకల్ అథారిటీ క్రింద ఏదైనా లాభదాయకమైన కార్యాలయాన్ని కలిగి ఉంటే, వారు ఈ పదవిని నిర్వహించడానికి అర్హులు కాదు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభ, లోక్‌సభ నుండి పార్లమెంటు సభ్యులు మాత్రమే ఇందుకోసం ఓటు వేయగలరు. ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా ఉమ్మడి సమావేశంలో సమావేశమైన పార్లమెంటు ఉభయ సభల సభ్యులచే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఎన్నికలలో రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులే కాకుండా, ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి చెందిన నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అనుమతించబడతారు. ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే లోక్‌సభ, రాజ్యసభల ఉమ్మడి బలం అయిన 785 ఓట్లలో కనీసం 393 ఓట్లను సాధించాల్సి ఉంటుంది.

RBI: ఉచిత పథకాలతో ముప్పు.. ఆ ఐదు రాష్ట్రాల పరిస్థితిపై RBI నివేదిక.. ఏపీ, తెలంగాణ పరిస్థితేంటి.. ?

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్ షాక్.. మరో పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభలో బలాబలాలను బట్టి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థి మరోసారి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం లాంఛనమే. దీంతో ఈసారి బీజేపీ తరపున ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడికి మరోసారి అవకాశం ఇస్తారా లేక కొత్త వారికి ఛాన్స్ దక్కుతుందా ? అన్నది తెలియాల్సి ఉంది. గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపిన బీజేపీ.. ఉపరాష్ట్రపతిగా ఏ వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేస్తుందన్న దానిపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది.

First published:

Tags: Vice President of India

ఉత్తమ కథలు