కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి త్వరలో కొత్త అధ్యక్షుడు (Congress President) రాబోతున్నారు. AICC అధ్యక్షుడి ఎన్నికకు సీడబ్ల్యూసీ ముహూర్తం ఖరారు చేసింది. ఇవాళ మధ్యాహ్నం సోనియా గాంధీ (Sonia Gandhi) అధ్యక్షతన వర్చువల్గా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా అధ్యక్ష ఎన్నికలపైనే చర్చ జరిగింది. అనంతరం కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికకు షెడ్యూల్ను విడుదల చేశారు. CWC మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venu Gopal).. అక్టోబరు 17న అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. అక్టోబరు 19న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
CWC met under Sonia Gandhi & approved the final schedule. Nomination process for post of Congress president will be from Sept 24 to Sept 30. Elections to be held on October 17 & counting of polls & declaration of results will be on October 19: Congress MP KC Venugopal pic.twitter.com/AbK5SAu8vN
— ANI (@ANI) August 28, 2022
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం సెప్టెంబరు 24 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబరు 30 నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. ఐతే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుముఖంగా లేరు. కానీ ఆయన్ను ఒప్పించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ తీసుకుంటేనే బాగుటుందని కార్యకర్తలు చెబుతున్నారని.. తన అభిప్రాయం కూడా అదేనని మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. నేతలందరినీ ఏకం చేసి.. పార్టీని బలోపేతం చేసే సామర్థ్యం ఆయనకు ఉందని అన్నారు.
Delhi | Along with all the Congress workers, it's my personal opinion that Rahul Gandhi should take the lead and become Congress president. He can unify and strengthen the Congress party: Senior Congress leader Mallikarjun Kharge pic.twitter.com/f3bQME7bmZ
— ANI (@ANI) August 28, 2022
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో.. దానికి బాధ్యత వహిస్తూ.. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజీనామా చేశారు. అప్పటి నుంచీ ఏఐసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్ సారథి బాధ్యతలను చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో సోనియా గాంధీ (Sonia Gandhi) తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఆమె కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి ఈ ముగ్గురూ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాకుంటే.. ఆ పదవిని ఎవరు చేపడతారన్న దానిపై కాంగ్రెస్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కాగా, ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నేతల వరుస రాజీనామాలతో కేడర్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహంచి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Rahul Gandhi, Sonia Gandhi