వాట్సప్‌లో వచ్చే ఈ మెసేజ్‌లను నమ్మొద్దు -ఈసీ

వాట్సప్‌లో ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫార్వర్డ్ మెసేజ్‌లను నమ్మొద్దని ఈసీ విజ్ఞప్తి చేస్తోంది. కొన్ని గ్రూపులు అదేపనిగా వాట్సప్‌లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని వీటిని నమ్మకూడదని, ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దంటూ సూచించింది.

Amala Ravula | news18-telugu
Updated: March 30, 2019, 12:41 PM IST
వాట్సప్‌లో వచ్చే ఈ మెసేజ్‌లను నమ్మొద్దు -ఈసీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నికల సమయంలో ఓటర్స్‌కి సరికొత్త సూచనలు చేస్తోంది ఈసీ. ఓటు హక్కు నమోదు కోసం అఫీషియల్ వెబ్‌సైట్ http://nvsp.in పోర్టల్‌కి మాత్రమే లాగిన్ అవ్వాలని ఫేక్ వార్తలను నమ్మొద్దంటూ తెలిపింది. అదేవిధంగా కొన్ని పార్టీలకు మాత్రమే ఓట్లు వేయాలంటూ వస్తున్న ప్రచారాలను కూడా నమ్మి మీ అమూల్యమైన ఓటుని వృథా చేయొద్దంటూ ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి షెఫాలీ శరణ్ ట్వీట్ చేస్తూ ఆ స్క్రీన్‌ షాట్‌ని పోస్ట్ చేశారు. అదేవిధంగా ఎన్‌ఆర్‌ఐలు తమ ఓటు హక్కు నమోదు కోసం http://eci.gov.in అనే వెబ్‌సైట్‌కి లాగిన్ కావొచ్చని సూచిస్తున్నారు.


ఇప్పటికే వాట్సప్‌లో ఫార్వర్డ్ అయ్యే ఫేక్‌న్యూస్‌లపై ఎంక్వైరీ జరుగుతుందని, త్వరలోనే వీటికి స్వస్తి చెప్పే ప్రయత్నం చేస్తామని ఈసీ తెలిపింది. ఇటూ వాట్సప్‌కూడా తమ వంతుగా ఫేక్‌ న్యూస్ భరతం పట్టే పనిలో పడింది. వాట్సప్‌లో ఫార్వర్డ్ అయ్యే న్యూస్‌లో ఇమేజ్ ద్వారా ఆ న్యూస్ నిజమా, కాదా అన్న విషయం తెలుసుకునే సరికొత్త ఫీచర్ రానుంది. దీనితో పాటు.. 'Forwarding Info', 'Frequently Forwarded' అనే సరికొత్త ఫీచర్స్ వస్తున్నాయి. ఇందులో ఫార్వర్డ్ ఇన్ఫో మెసెజ్ ద్వారా మెసేజ్ ఎవరి నుంచి ఫార్వర్డ్ అయిందన్న విషయం తెలుస్తుంది. అదే విధంగా.. ఫ్రీక్వెంట్లీ ఫార్వెర్డ్ మెసెజ్ ద్వారా 4 అంతకన్నా ఎక్కువసార్లు మెసేజెస్ వస్తే తెలుసుకోవచ్చు.
First published: March 30, 2019, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading