Election commission: ఇండియాలో చాలా మంది చదువు, ఉద్యోగం, ఇతర పనుల కోసం పుట్టిన ఊరి నుంచి నగరాలకు వెళ్లి జీవిస్తుంటారు. వీరిలో చాలా మంది స్వగ్రామానికి తిరిగివచ్చేది పండగలు, ఎన్నికలకు మాత్రమే. కొందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం సొంత గ్రామానికి చేరుకుంటారు. ఇంకొందరు వివిధ కారణాల వల్ల పోలింగ్‌కు దూరమవుతారు. ప్రస్తుతం పోలింగ్ శాతం పెంచేందుకు, ఇతర ప్రాంతాల్లో జీవిస్తున్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్(EC) చర్యలు తీసుకుంటోంది. రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గురువారం తెలిపింది.
Dogs: 100 దేశీయ కుక్క జాతులను సంరక్షిస్తున్న తమిళనాడు వాసి..బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2022 సొంతం..
ఓటు వేయని వారు 30 కోట్ల మంది
పని, వివాహం, విద్య వంటి కారణాలతో చాలా మంది అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు దూరమవుతున్నారని ఈసీ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు భాగస్వామ్యం పెరిగినప్పటికీ, దాదాపు 30 శాతం మంది ఇప్పటికీ ఓటు వేయలేదని, ఓటరు భాగస్వామ్యం నిలిచిపోయిందని కమిషన్ పేర్కొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 66.44 శాతం ఓటింగ్ నమోదు కాగా, 2019లో 67.40 శాతానికి పెరిగినట్లు తెలిపింది. వాస్తవానికి దాదాపు ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరు ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం లేదని వివరించింది. ఇలాంటి వారి సంఖ్య దాదాపుగా 30 కోట్లుగా ఉంది.
మాడిఫైడ్ EVMల వినియోగం
ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంతో.. ఎలక్షన్ కమిషన్ దేశీయ వలసదారుల కోసం రిమోట్ పోలింగ్ స్టేషన్‌లలో అంటే స్థానిక నియోజకవర్గం వెలుపల ఉన్న పోలింగ్ స్టేషన్‌లలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనుంది. ఇప్పటికే ఉన్న EVMల మాడిఫైడ్ వెర్షన్‌లను ఉపయోగించనుంది. ఇప్పటివరకు బ్యాలెట్ పేపర్ ద్వారా మారుమూల ప్రాంతాల నుంచి ఓటు వేసే సదుపాయం ఉంది. కానీ ఈ అవకాశం సర్వీస్ ఓటర్లు, స్పెషల్ ఆఫీస్ హోల్డర్స్, ఎన్నికల విధుల్లో ఉన్న వ్యక్తులు, ప్రివెంటివ్ డిటెన్షన్‌లో ఉన్న వ్యక్తులు వంటి కొన్ని వర్గాలకు మాత్రమే ఉంది.
Alcohol Lovers: మద్యంప్రియుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.. ఆల్కహాల్ లవర్స్ సంఘం డిమాండ్స్ ఇవే
రిమోట్ EVM ప్రోటోటైప్
ప్రస్తుతం ఈసీ వినియోగిస్తున్న ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(BEL), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) తయారు చేశాయి. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ఆధారంగా రిమోట్ ఓటింగ్ కోసం పటిష్టమైన, ఫెయిల్ ప్రూఫ్, సమర్థవంతమైన స్టాండ్-అలోన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ఆ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు EC తెలిపింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోకి వచ్చే ECIL, ఒకే రిమోట్ పోలింగ్ బూత్‌లో గరిష్టంగా 72 నియోజకవర్గాల పోలింగ్‌ను నిర్వహించగల ప్రొటోటైప్ మల్టి కాన్స్టిట్యూషన్సీ రిమోట్ ఈవీఎం(RVM)ను అభివృద్ధి చేసింది. ప్రపోజ్డ్ RVM సిస్టమ్ స్వదేశీ వలసదారులకు పని చేసుకుంటున్న ప్రాంతాల నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది. కొత్త విధానంతో ఏ రాష్ట్రం నుంచి వచ్చినా అతని/ఆమె సొంత నియోజకవర్గానికి ఓటు వేసే సౌకర్యం ఉంటుంది. సొంత రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఈ సదుపాయం ద్వారా ఓటు వేయవచ్చు. రాష్ట్రంలోని వలస ఓటర్ల సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో రిమోట్ పోలింగ్ బూత్‌లను రాష్ట్రంలోనే పైలట్‌గా ఏర్పాటు చేయవచ్చు.
RVM ఓటింగ్ పద్ధతి
రిమోట్ ఓటరు రిమోట్ ఓటింగ్ సదుపాయం కోసం ఎన్నికలకు ముందు ముందస్తు నోటిఫికేషన్ సమయంలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ద్వారా ముందుగా నమోదు చేసుకోవాలి. ఓటరు వివరాలను తొలుత సొంత నియోజకవర్గంలో ధ్రువీకరిస్తారు. అనంతరం రిమోట్ ఓటింగ్‌కు అవకాశం ఇస్తారు. వారి ప్రస్తుత నివాస స్థలాల్లో రిమోట్ ఓటింగ్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
RVM ఫీచర్లు
రిమోట్ ఓటింగ్ మెషిన్ అనేది ఇప్పటికే ఉన్న EVMల మాదిరిగానే సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తుంది. ఇది స్టాండలోన్, నాన్ నెట్‌వర్క్‌డ్ సిస్టమ్. ఓటరుకు ఈవీఎం మాదిరిగానే ఓటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. RVM సిస్టమ్ అనేది ఇప్పటికే ఉన్న EVM సిస్టమ్ మాడిఫైడ్ వెర్షన్ మాత్రమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Election Commission of India, EVM, Staff Selection Commission