Home /News /national /

ELECTION COMMISSION ON INDIA WILL REVIEW ON CAMPAIGN AND RALLIES ON SATURDAY AK

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం.. రేపు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ (ఫైల్ ఫోటో)

యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ (ఫైల్ ఫోటో)

Uttar Pradesh: కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలను జనవరి 15 వరకు నిషేధిస్తున్నట్లు, జనవరి 15న మళ్లీ కరోనా పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపింది.

    ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం జనవరి 15 వరకు రోడ్ షోలు, తాజాగా ఎన్నికల సంఘం ఈ పరిమితిని పెంచవచ్చని తెలుస్తోంది. త్వరలో దీనిపై పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఈ నిషేధాన్ని విధించింది. అయితే ఒక వారం తర్వాత కూడా పరిస్థితిని మెరుగుపరచడానికి బదులుగా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని నిషేధాన్ని మరింత పొడిగించవచ్చని తెలుస్తోంది. కమిషన్ ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తుందని.. రేపటిలోగా కొత్త ఉత్తర్వులు వెలువడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్ ర్యాలీలపై నిషేధం కొనసాగవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

    అయితే ఈ ఆంక్షలు ఎన్ని రోజుల పాటు అమలులో ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు,. ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ ఎన్నికల కమిషన్ కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలను జనవరి 15 వరకు నిషేధిస్తున్నట్లు, జనవరి 15న మళ్లీ కరోనా పరిస్థితిని సమీక్షించనున్నట్లు తెలిపింది. మరి ఆ తర్వాతే నిషేధం కొనసాగుతుందా లేదా తొలగించబడుతుందా అనేది రేపు తేలనుంది. అయితే రాజకీయ పార్టీలు కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే.. రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి.

    మిగతా రాష్ట్రాల సంగతి ఎలా.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం ఉన్న తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేలా అధికార బీజేపీ వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తోంది. అయితే అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విపక్ష సమాజ్‌వాదీ పార్టీలో చేరుతుండటం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితి ఊహించని దానికి భిన్నంగా ఉండబోతోందనే సంకేతాలను ఇస్తోంది. త్వరలోనే మొదటి, రెండు దశ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికను ఇటు బీజేపీ, టు సమాజ్‌వాదీ పార్టీ సారథ్యంలోని కూటమి ఖరారు చేయబోతోంది.

    UP elections : దళితుడి ఇంట్లో సీఎం భోజనం.. పండగకు పిలిచినందుకు ధన్యవాదాలు..అంటూ..

    UP Elections : యూపీ బీజేపీకి మరో షాక్, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి జంప్.. మోదీ ఇతర నేతల సమావేశం

    కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారంపై ఆంక్షలు విధిస్తే ఏం చేయాలనే దానిపై బీజేపీ ఇప్పటికే ఓ రూట్ మ్యాప్ ఖరారు చేసుకుంది. డిజిటల్ మార్గంలో ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడయ్యింది. మరోవైపు యూపీ ఎన్నికల్లో కీలకంగా మారే సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపికలో ముందుకు సాగేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. స్వయంగా ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి రేపు కేంద్ర ఎన్నికల సంఘం ర్యాలీలు, సభలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Election Commission of India, Uttar Pradesh Assembly Elections

    తదుపరి వార్తలు