Home /News /national /

ELECTION COMMISSION OF INDIA WORKING ON TECH SOLUTION FOR LOST VOTES SAYS CEC SUNIL ARODA NK

My Vote : ఓటర్లకు గుడ్ న్యూస్... ఓటు వేయడానికి త్వరలో సరికొత్త సౌలభ్యం...

ఈవీఎంలు

ఈవీఎంలు

Election Commission of India : మన దేశంలో ఇప్పటివరకూ ఓటు వేయాలంటే కొన్ని కండీషన్లు ఉంటున్నాయి. వాటి వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నా్రు. ఆ విషయాల్లో బ్లాక్ చైన్ వ్యవస్థను అభివృద్ధి చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం.

    Election Commission of India : ఇప్పటివరకూ దేశంలో ఒక్కో రాష్ట్రం వాళ్లు ఒక్కో చోట ఉంటున్నారు. ఓటు వేసే టైంలో చాలా మంది తమ స్వస్థలాల్లో ఓటు వెయ్యలేకపోతున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చాలా మంది హైదరాబాద్‌లో ఉంటుంటారు. అలాంటి వాళ్లు తమ స్వస్థలాల్లో ఓటు వేయాలనుకున్నా... కొన్ని పరిస్థితుల వల్ల అవకాశం మిస్సై... హైదరాబాద్‌లో ఓటు వేస్తున్నారు. ఇకపై అలా కాకుండా... ఎవరి స్వస్థలాల్లో వాళ్లు ఓటు వేసేందుకు వీలు కల్పించేలా... ఓ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం IIT మద్రాస్ సాయంతో... బ్లాక్ చైన్ వ్యవస్థ (Blockchain System)ను తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా వివరించారు. దీని వల్ల ఏ రాష్ట్ర ప్రజలు మరే రాష్ట్రంలో ఉంటున్నా... తమ సొంత రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు... ఓటు వేసేందుకు వీలవుతుంది. ఐతే... ఓటు వేసేందుకు కచ్చితంగా తమ సొంత రాష్ట్రానికి వెళ్లే వెయ్యాలి తప్ప... ఏ ఇంటర్నెట్ ద్వారానో, మొబైల్ ద్వారానో వెయ్యలేరు. కాబట్టి... ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ ఉద్యోగానికో వెళ్తే... ఆ రోజు సెలవు తీసుకొని... ఓటు వేసేందుకు సొంత రాష్ట్రంలో, సొంతూరికి వెళ్లాలన్నమాట.

    ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం... ఏ రాష్ట్రంలో నివసిస్తున్నవారు... ఆ రాష్ట్రంలోనే ఓటు హక్కు పొంది ఓటు వేస్తున్నారు. ఐతే... అలా వేస్తున్న వారు... తమ సొంత రాష్ట్రంలో తమ సొంత నేతను ఎన్నుకోలేకపోతున్నామో అని ఫీలవుతున్నారు. ఉదాహరణకు ఏపీలోని గుంటూరులో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు... తెలంగాణలో ఎన్నికలు జరిగితే... అక్కడి నుంచీ తెలంగాణ వచ్చేసి తమ ప్రియతమ నేతను ఎన్నుకునేందుకు తెలంగాణలో తమ సొంతూరిలో ఓటు వెయ్యవచ్చు. అందువల్ల సొంత నేతను ఎన్నుకున్నట్లవుతుంది... అలాగే సొంతూరిని ఓసారి చూసినట్లు కూడా అవుతుంది.

    ఢిల్లీలో చిట్ చాట్ మాట్లాడిన సీఈసీ... మరోసారి మన భారతీయ ఈవీఎంల వల్ల ట్యాంపరింగ్ సాధ్యం కాదని తెలిపారు. అమెరికాలో ఈవీఎంలకి ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై లాంటివి ఉంటాయి కాబట్టి వాటిని ట్యాంపరింగ్ చెయ్యగలరు. అదే ఇండియాలో ఈవీఎంలు పేరుకే ఈవీఎంలు. అవి ఇంటర్నెట్‌తో లింక్ చేసి ఉండవు కాబట్టి... ట్యాంపర్ చెయ్యలేరని సీఈసీ తెలిపారు. ఇక ఎన్నికల సంస్కరణలు, జమిలి ఎన్నికలు (కేంద్రం, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు) వంటివి నిర్వహించేందుకు కూడా ఈసీ సిద్ధంగానే ఉంది. రాజకీయ పార్టీలు ఓ నిర్ణయం తీసుకుంటే... తమకేమీ అభ్యంతరం లేదని సునీల్ అరోడా తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Election Commission of India, Vote, Voter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు