నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..

Election Commission of India: ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు ఓటర్ల జాబితా వెరిఫికేషన్ చేపట్టనున్నారు. సెప్టెంబరు 1 నుండి సెప్టెంబరు 30 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్లపై బూత్ లెవల్ ఆఫీసర్లు వెరిఫికేషన్ చేయనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 1, 2019, 6:58 AM IST
నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ.. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓటరు జాబితాలో ప్రత్యేక సవరణల కోసం మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 1 నుండి ఆగస్టు 31 వరకు ఓటర్ల జాబితా వెరిఫికేషన్ చేపట్టనున్నారు. సెప్టెంబరు 1 నుండి సెప్టెంబరు 30 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్లపై బూత్ లెవల్ ఆఫీసర్లు వెరిఫికేషన్ చేయనున్నారు. సెప్టెంబరు 16 నుండి అక్టోబరు 15 వరకు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పోలింగ్ స్టేషన్ల సరిహద్దులు గుర్తించనున్నారు. అక్టోబరు 15 న ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేయనున్నారు. అక్టోబరు 15 నుండి నవంబరు 30 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. నవంబరు 2, 3 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు.

డిసెంబరు 15 కల్లా వినతులను పరిష్కరించి, డిసెంబరు 31న మార్పులు, కొత్త ఓటర్ల చేర్పులను జాబితా చేర్చి, అనుబంధ ఓటర్ జాబితా ముద్రించనున్నారు. 2020 జనవరి 1-15 మధ్యలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...