Home /News /national /

ELECTION COMMISSION OF INDIA PROPOSAL TO CENTRE TO BAN PEOPLE FROM FIGHTING POLLS FROM MORE THAN ONE SEAT WITH HEFTY FINE AK GH

Election Commission: ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసే వారికి షాక్.. కేంద్రానికి ఈసీ సూచన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచే రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు రూ.5 లక్షలు, లోక్‌సభ సభ్యులకు రూ.10 లక్షలు ఫైన్ విధించాలంటూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఓ ప్రతిపాదనను ఈసీ (EC) సమర్పించింది. తద్వారా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు విముఖత చూపుతారన

ఇంకా చదవండి ...
ఎన్నికల్లో ఒక అభ్యర్థి (Candidate) కేవలం ఒకే నియోజకవర్గం (Constituency) నుంచి పోటీ చేయాలనే నిబంధన ప్రస్తుత ఎన్నికల చట్టాల్లో ఎక్కడా లేదు. అందుకే చాలామంది పొలిటీషియన్లు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే ఒకవేళ వీరు పోటీ చేసిన రెండు సీట్లలోనూ గెలిస్తే ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే ఏదో ఒక నియోజకవర్గంలో మళ్లీ బైపోల్స్ (Bypolls) నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా బైపోల్స్ నిర్వహణకు ఎన్నికల సంఘం డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అయితే ఈ ఖర్చులను ఇకపై రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచిన అభ్యర్థులపైనే మోపాలని ఎన్నికల సంఘం (EC) యోచిస్తోంది. ఇందులో భాగంగా రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచే రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు రూ.5 లక్షలు, లోక్‌సభ సభ్యులకు రూ.10 లక్షలు ఫైన్ విధించాలంటూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ఓ ప్రతిపాదనను ఈసీ (EC) సమర్పించింది. తద్వారా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు విముఖత చూపుతారని భావిస్తోంది.

వాస్తవానికి దాదాపు రెండు దశాబ్దాల క్రితమే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా చట్టాన్ని సవరించాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రతిపాదనను ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోటీ చేసే సంఖ్యను ఒకటికి తగ్గించలేకపోయినా, నియోజక వర్గాల్లో ఒకదానిని ఖాళీ చేసి.. ఉప ఎన్నికకు దారితీసే అభ్యర్థులపై భారీ జరిమానా (Hefty Fine) విధించాలని ఈసీ పేర్కొంది. ఉప ఎన్నికలకు కారణమయ్యే అభ్యర్థి వల్ల.. అభ్యర్థి నిష్క్రమించే నియోజకవర్గం ఓటర్లకు అన్యాయం చేసినట్లే అవుతుంది. అలాగే ఎన్నికల సంఘంపై ఆర్థిక భారం పడటంతో పాటు మ్యాన్‌పవర్‌పై కూడా ఒత్తిడి పడుతుంది. ఓటర్లు మళ్లీ ఓటు వేయాల్సి పరిస్థితి కూడా వస్తుందని ఒక అధికారి తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖలోని శాసనసభ కార్యదర్శితో ఇటీవల జరిగిన చర్చలో, ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 2004లో మొదటిసారిగా ప్రతిపాదించిన ఈ సంస్కరణల గురించి లేవనెత్తారు.



ఒక వ్యక్తి, ఒక ఓటు.. ఒక అభ్యర్థి, ఒక నియోజకవర్గం అనేది ప్రజాస్వామ్యం శాసనం అయినప్పటికీ నేటి ఎన్నికల చట్టం ప్రకారం, సాధారణ ఎన్నికల్లో లేదా ఉప ఎన్నికలు లేదా ద్వైవార్షిక ఎన్నికల్లో రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీ చేయవచ్చు. అయితే ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి ఎన్నికైనట్లయితే, వారు గెలిచిన సీట్లలో ఒక దానిని వదులుకోవాల్సి ఉంటుంది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం (Representation of the People Act)లోని సెక్షన్ 33 (7) అభ్యర్థులను రెండు నియోజకవర్గాల్లో నిల్చోవచ్చని చెబుతోంది. కాగా 1996లో ఆర్‌పీఏ చట్టంలో ఈ సవరణ చేశారు. ఈ సవరణకు ముందు అభ్యర్థులు ఎన్ని నియోజకవర్గాల నుంచి అయినా పోటీ చేయవచ్చు.

Government Employees: కేంద్రం సంచలనం.. ఉద్యోగులకు VPN ఇతర సర్వీసులు నిషేధం..

Explainers: అగ్నిపథ్ స్కీమ్‌పై ఎందుకంత వ్యతిరేకత..? భయాలు, అపోహలు, కేంద్రం వైఖరిపై న్యూస్‌18 వివరణ..

పోల్ ప్యానెల్.. 2004లో ఆర్‌పీఏ చట్టంలోని కొన్ని సెక్షన్‌లకు సవరణను ప్రతిపాదించి, ఒక వ్యక్తి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకూడదని అభిప్రాయ పడింది. "అయితే, ప్రస్తుత నిబంధనలను యథావిధిగా ఉంచాలనుకున్నా.. రెండు స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థి రెండు స్థానాలను గెలిస్తే.. ఖాళీ చేయాలని నిర్ణయించుకున్న స్థానానికి ఉప ఎన్నికల ఖర్చును భరించాలి." అని ఈసీ ప్రతిపాదన చేసింది. రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికలకు రూ.5 లక్షలు, లోక్‌సభ ఎన్నికలకు రూ.10 లక్షలు జరిమానా కట్టాలని ఈసీ ప్రతిపాదించింది. అయితే అనేక చట్టపరమైన సమస్యలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చే లా కమిషన్, అభ్యర్థులను ఒక సీట్‌కే పరిమితం చేసే ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. కానీ గెలుపొందిన అభ్యర్థులు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చును భరించాలనే ప్రతిపాదనను అది ఆమోదించలేదు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Election Commission of India, Union government

తదుపరి వార్తలు