• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • ELECTION COMMISSION OF INDIA BANS ALL VICTORY PROCESSION ON OR AFTER COUNTING DAY OF MAY 2 ORDER AS FOLLOWS NK

ECI Order: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్... అలా చేస్తే చర్యలే

ECI Order: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్... అలా చేస్తే చర్యలే (ప్రతీకాత్మక చిత్రం)

ECI Order: మద్రాస్ హైకోర్టు వేసిన మొట్టికాయలతో... కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిసొచ్చింది. తత్వం బోధపడింది. తెల్లారేసరికి సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    ECI Order: దేశంలో కరోనా వ్యాప్తి బాగా ఉంది కాబట్టి... మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు గానీ... వచ్చిన తర్వాత గానీ... రాజకీయ పార్టీలు సంబరాలు చేయడానికి వీల్లేదు. విజయోత్సవ ర్యాలీలు, పార్టీలు, వేడుకలు ఏవీ చెయ్యకూడదు అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నిన్న మద్రాస్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద షాకే ఇచ్చింది. ఇండియాలో సెకండ్ వేవ్ రావడానికి ఈసీయే కారణం అని ఫైర్ అయ్యింది. ఎన్నికల సంఘం అధికారులపై హత్యా నేరం కింద కేసులు పెట్టాలని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల్లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. చాలా మంది రాజకీయ నేతల వల్లే కరోనా పెరుగుతోందని ఆరోపించారు. ఈ ఎన్నికలు, ప్రచారాలు, ర్యాలీల వల్ల ప్రజలు గుంపులుగా ఉంటుంటే... కరోనా పెరగకుండా ఉంటుందా అని విశ్లేషకులు మండిపడ్డారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘానికి తప్పు తెలిసొచ్చింది. తెల్లారే తాజా ఆదేశం జారీ చేసింది.

    మే 2న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఐతే... ఈ 5 రాష్ట్రాల ఎన్నికల వల్లే దేశంలో కరోనా బాగా పెరిగిపోయిందనే వాదన ఉంది. ఈ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు... వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని... పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రచార సభలు నిర్వహించాయి. దాంతో... ఎక్కడా కరోనా రూల్స్ అమల్లో లేకుండా పోయాయి. మాస్కులు లేవు, సోషల్ డిస్టాన్స్ లేదు, శానిటైజర్లూ వాడలేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుంపులుగా రావడం వల్ల... ఇప్పడు దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ చంపేస్తోంది. అందుకే మద్రాస్ హైకోర్టు ఆ స్థాయిలో ఫైర్ అయ్యింది. ఇప్పటికీ బెంగాల్‌లో తాజాగా ఏడో దశ పూర్తైంది. ఇంకో దశ మిగిలే ఉంది. ఇలాంటి సమయంలో ఈసీ తాజా నిర్ణయం రాజకీయ పార్టీలకు మింగుడు పడకపోయినా... దేశానికి మాత్రం మేలే చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గాలంటే... మనుషుల మధ్య దూరం పెరగాల్సిందే. కరోనా వచ్చిన ఒక మనిషి నుంచి మరో మనిషిని చేరడానికి కరోనా వైరస్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేసినప్పుడే ఆ వైరస్ వ్యాప్తి అక్కడితో ఆగుతుంది. కానీ ఇప్పుడు దేశంలో లాక్‌డౌన్ లేదు కాబట్టి... ప్రజలు స్వేచ్ఛగా ఉంటున్నారు. ఇదే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అలాగని దేశమంతా లాక్‌డౌన్ పెట్టడం కూడా కరెక్టు కాదని అంటున్నారు. ఎక్కడ కేసులు ఎక్కువ ఉంటే అక్కడే లాక్‌డౌన్ పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Covid: ఒకే అంబులెన్స్‌లో 22 మంది కరోనా మృతులు. ఇండియాలో దయనీయ పరిస్థితి ఇదీ

    మే 2న జరిగే ఎన్నికల కౌంటింగ్‌లో కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో రిపోర్ట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు కోరింది. సరైన చర్యలు తీసుకోవట్లేదు అని హైకోర్టు భావిస్తే... కౌంటింగ్ జరగకుండా చేస్తామని హెచ్చరించింది. ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఇదే టెన్షన్ తెప్పిస్తోంది. అందుకే తెల్లారే సరికి తాజా ఆదేశం జారీ చేసింది.
    Published by:Krishna Kumar N
    First published: