ప్రతీకాత్మక చిత్రం (File)
మహారాష్ట్రలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహారాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ గవర్నర్ కోషియారీ కోరడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. దీంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఊరట కలగనుంది. ప్రస్తుతం శాసనసభ, శాసనమండలి దేంట్లోనూ సభ్యుడు కాని ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల లోపు ఏదైనా సభలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. ఆయన ఎమ్మెల్సీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, కరోనా వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఓ దశలో ఉద్ధవ్ థాక్రేను నేరుగా ఎమ్మెల్సీగా నామినేట్ చేయాల్సిందిగా గవర్నర్ కోషియారీని కోరుతూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. అయితే, గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఉద్ధవ్ థాక్రే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఉద్ధవ్ థాక్రే గత ఏడాది నవంబర్ 28న మహారాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఈ ఏడాది మే 28తో ఆయనకు ఆరు నెలల పదవీకాలం పూర్తవుతుంది. ఈ ఆరునెలల్లో ఆయన అసెంబ్లీలోని ఉభయ సభల్లో ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఉద్ధవ్ థాక్రే ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన తర్వాత గవర్నర్ కోషియారీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని కోరారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
May 1, 2020, 2:08 PM IST