దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ... EVMల భద్రతపై ప్రజల్లో చాలా డౌట్లు వస్తున్నాయి. ఈవీఎంలు ఎత్తుకుపోతున్నారనీ, రహస్యంగా తరలిస్తున్నారనీ చాలా మంది ఆరోపిస్తున్నారు. అలాంటి వాళ్లు కంప్లై్ంట్లు ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ఏర్పాటు చేసింది. కంప్లైంట్లను తమ దృష్టికి తెచ్చేలా... 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూంని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత, తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఉంచడానికి అభ్యర్థులకు కావాల్సిన అనుమతులు, కౌంటింగ్ సమయంలో ఈవీఎంలకు సంబంధించి ఇబ్బందులు ఇలా ఎన్నో అంశాలపై ఏవైనా అనుమానాలుంటే కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన 011-23052123 నంబర్‌కి కాల్ చేసి కంప్లైంట్ చెయ్యవచ్చు. ఇందుకు సంబంధించి ఈసీ మంగళవారం సాయంత్రం ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
ఈవీఎంల భద్రత విషయంలో 22 పార్టీల విపక్ష నేతలు లేవనెత్తిన సందేహాలపై ఈసీ స్పందించింది. యంత్రాల్ని తారుమారు చేసి వాటి స్థానంలో కొత్తవి పెట్టారని వస్తున్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈవీఎంల మార్పిడి జరిగిందని వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈవీఎంలు ఎన్నికల్లో ఉపయోగించినవి కాదని వివరించింది. ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ కోసం, అదనంగా రిజర్వ్‌గా ఉంచిన వాడని ఈవీఎంలను వేర్వేరు రాష్ట్రాల నుంచీ తీసుకెళ్లారే తప్ప అవి ఎన్నికల్లో ఉపయోగించినవి కావని ఈసీ తెలిపింది.
పోలింగ్ పూర్తయిన వెంటనే పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించామనీ... అభ్యర్థులు, ఈసీ పరిశీలకుల సమక్షంలోనే వాటిని రూంలలో భద్రపరిచామని తెలిపింది. అలాగే ఈ సెక్యూరిటీ అంతా వీడియోలో రికార్డ్ చేశామని స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు, సాయుధ పోలీసుల పహారాలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని ఈసీ స్పష్టం చేసింది. దేశంలో చాలా చోట్ల ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో... ఈవీఎంలను తరలిస్తున్నారంటూ సోమవారం సాయంత్రం నుంచీ సోషల్ మీడియాల్లో వీడియోలు వస్తుండటంతో ఈసీ ఈ క్లారిటీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి :
లగడపాటి కొత్తగా చెబుతున్నదేంటి... సర్వేపై తాజాగా ఏమన్నారంటే...
Election Results : కౌంటింగ్ టెన్షన్... ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...
వైఎస్ జగన్‌కు Z కేటగిరీ భద్రత... ఎందుకో తెలుసా...
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Election Commission of India, EVM, Evm tam, Evm tampering, Vvpat