హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

KA Paul: కేఏ పాల్‌కి షాక్.. ప్రజాశాంతి పార్టీ సహా ఈ పార్టీల గుర్తింపు రద్దు.. ఈసీ సంచలన నిర్ణయం

KA Paul: కేఏ పాల్‌కి షాక్.. ప్రజాశాంతి పార్టీ సహా ఈ పార్టీల గుర్తింపు రద్దు.. ఈసీ సంచలన నిర్ణయం

కేఏ పాల్

కేఏ పాల్

KA Paul Praja Shanti Party: తెలంగాణ నుంచి రిజిస్టర్‌ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పిన ఈసీ.. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఎల్ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కేంద్రం ఎన్నిక ల సంఘం (Election Commission)  వద్ద కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. ఐతే ఇందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్‌గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. క్రియాశీలంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. అంతేకాదు మనుగడలోని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. తెలంగాణ నుంచి రిజిస్టర్‌ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పిన ఈసీ.. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఎల్ పాల్‌ (KA Paul)కు చెందిన ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) కూడా ఉంది. యాక్టివ్‌గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

  గతంలోనూ పలు పార్టీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. మే నెలలో 87పార్టీలు, జూన్‌లో 111పార్టీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితా నుంచి తొలగించింది. తాజాగా మరో 253 పార్టీలపై వేటు వేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల నివేదికను అనుసరించి వాటిపై తదుపరి చర్యలు తీసుకోనున్నామని ఈసీ వెల్లడించింది. తెలంగాణ , తమిళనాడు , కర్నాటక, మహారాష్ట్ర  బీహార్ , ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ పార్టీలు నమోదయ్యాయని పేర్కొంది. ఇవి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని.. తాము జారీ చేసిన నోటీసులు, లేఖలకు ఎలాంటి స్పందన తెలిజయేడం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2014, 2019లో జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ.. లోక్‌ సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని తెలిపింది. 253 పార్టీల్లో 66పార్టీలు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేయలేదని వెల్లడించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. రిజిస్టర్ రాజకీయపార్టీలు ఐదేళ్లలోపు ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీచేయాలి. ఒకవేళ ఏ పార్టీ అయినా వరుసగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. ఆ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి ఎన్నికల సంఘం తొలగిస్తుంది. తాజా నిర్ణయంతో ఎన్నికల నియమావళిని పాటించడంలో విఫలమైన మొత్త పార్టీల సంఖ్య 537కి చేరుకుంది.

  తెలంగాణ నుంచి గుర్తింపు రద్దయిన పార్టీల జాబితాలో.. ఆల్‌ ఇండియా మహిళా డెమొక్రటిక్‌ ఫ్రంట్‌, భారతీయ యువత, సమత, రాష్ట్రీయత కాంగ్రెస్‌ పార్టీ, నవ తెలంగాణ పార్టీ, ప్రజా చైతన్య పార్టీ, త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ, అఖండ్‌ భారత్‌ నేషనల్‌ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తిదళ్‌ పార్టీ, ఆలిండియా ముత్తహిద్‌ క్యుయామి మహాజ్‌, ఆంధ్రప్రదేశ్‌ నవోదయ ప్రజాపార్టీ, భారత్‌ అభ్యుదయ్‌ పార్టీ, మన పార్టీ, నేషనలిస్ట్‌ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజా భారత్‌ పార్టీ, ప్రజా పార్టీ, ప్రజాశాంతి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, యూత్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌, సెక్యులర్‌ డెమొక్రటిక్‌ లేబర్‌ ఆఫ్‌ ఇండియా, సురాజ్‌ పార్టీలు ఉన్నాయి. ఈ నిర్ణయంపై ఏదైనా రాజకీయ పార్టీ అసంతృప్తిగా ఉంటే ఈసీని సంప్రదించవచ్చు. అన్నిఆధారాలు, సంవత్సరం వారీగా వార్షిక ఆడిట్ చేసిన ఖాతాలు, వ్యయ నివేదిక, ఆఫీస్ బేరర్‌ల జాబితాతో 30 రోజులలోపు ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Ka paul, Praja shanti party, Telangana

  ఉత్తమ కథలు