పెళ్లికొడుకులా వెళ్లి నామినేషన్ వేశాడు... బుక్కయ్యాడు

ఏకంగా పెళ్లికొడుకు వేషంలో గుర్రంపై ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్ కిషన్. కొంతదూరం వరకు అలాగే వెళ్లాడు. శేర్వాణీ ధరించి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించాడు.

news18-telugu
Updated: April 9, 2019, 8:07 PM IST
పెళ్లికొడుకులా వెళ్లి నామినేషన్ వేశాడు... బుక్కయ్యాడు
నామినేషన్ వేయడానికి బయలుదేరిన రాజ్ కిషన్ (Image: Twitter/ANI)
  • Share this:
కొందరు ఏం చేసినా... అందులో ఏదో ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్లు రాజకీయాల్లోనూ ఉంటారు. తాము గెలిచామా లేదా అన్న విషయం పక్కనపెడితే... తమ చర్యలతో ప్రజలు తమను గుర్తుంచుకునేలా చేస్తుంటారు కొందరు వ్యక్తులు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంయుక్త్ వికాస్ పార్టీ నేత వైద్ రాజ్ కిషన్ కూడా ఈ కోవలోకే వస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ లోక్ సభ స్థానానికి సోమవారం సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు రాజ్ కిషన్. అయితే ఈ సందర్భంగా ఆయన సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పెళ్లికొడుకు వేషంలో గుర్రంపై ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించాడు రాజ్ కిషన్. కొంతదూరం వరకు అలాగే వెళ్లాడు. శేర్వాణీ ధరించి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించాడు.

తాను రాజకీయాలకు అల్లుడి లాంటివాడినని అందుకే అలా చేశానని వ్యాఖ్యానించాడు. అయితే నిబంధనలకు ఇది విరుద్ధం అంటూ అధికారులు అతడిని అడ్డుకున్నారు. దీంతో గుర్రం దిగి సాధారణంగానే రాజ్ కిషన్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అతడు చేసిన హంగామాకుగానూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ రకంగా విభిన్నంగా వ్యవహరించడం రాజ్ కిషన్‌కు కొత్తేమీ కాదు. 2017లో పాడె మీద శవంలా వెళ్లి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించాడు రాజ్ కిషన్. అలా ఎన్నికల్లో గెలవకపోయినా... తన వింత చేష్టలతో ప్రజలు తనను గుర్తుంచుకునేలా చేసుకుంటున్నాడు.First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading