ELECTION CAMPAIGN TIME LIMITS EASED AND RALLIES WITH ATTENDANCE CAPS PVN
5 States Elections : ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రల విషయంలో ఈసీ కీలక నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం
Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారంపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. కోవిడ్ కేసులు కారణంగా
Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారంపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. కోవిడ్ కేసులు కారణంగా జనవరి 8న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ లకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు ఎన్నికల సంఘం భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రలపై నిషేధం విధించింది. తర్వాత కేసుల సంఖ్య తగ్గడంతో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పుడు దేశంలో కేసులు భారీగా తగ్గడంతో పరిమితులను సడలించింది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ పరస్థితి, ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోపాదయాత్రలు, ర్యాలీలకు అనుమతినిస్తూ శనివారం ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారాలను ఇప్పుడు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కాకుండా ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించవచ్చని పేర్కొంది. జిల్లా అధికారులు పర్మిషన్తో పరిమిత సంఖ్యలో వ్యక్తులతో పాదయాత్రలు కూడా అనుమతి ఇచ్చింది. అయితే కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, తక్కువ సంఖ్యతో వీటిని నిర్వహించుకోవాలని సూచించింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న విపత్తు నిర్వహణ అథారిటీ సూచించిన నియమాలను మాత్రం పాటించాలని నిబంధన విధించింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.