మహాభారతంలో దుర్యోధనుడికి ఉన్నంత అహంకారం ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కౌంటర్ ఇచ్చారు. అసలు అహంకారి రాహుల్ గాంధీయేనంటూ విరుచుకపడ్డారు. హర్యానాలో మంగళవారం జరిగిన ఓ ప్రచార సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి మహాభారతంలో దుర్యోధనుడికి ఉన్నంత అహంకారం ఉందని విమర్శించారు. ఈ దేశం అహంకారులను ఎట్టిపరిస్థితిలోనూ క్షమించదని.. కచ్చితంగా ఈసారి మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సుష్మా స్వరాజ్...ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
అసలు అహంకారి అంటే రాహుల్ గాంధీయేనంటూ సుష్మా స్వరాజ్ విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా 2013లో జరిగిన ఓ సంఘటనను ఆమె ప్రస్తావించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నాటి యూపీఏ సర్కారు జారీ చేసిన ఓ అత్యవసర ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చింపివేశారని విమర్శించారు. రాష్ట్రపతి ఆమోదముద్రవేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చింపివేసి అప్పటి ప్రధానిని అవమానించారని అన్నారు. అది.. అసలు అహంకారం అంటే. మీరు మాకు చెబుతున్నారా?’’ అంటూ సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
प्रियंका जी - आज आपने अहंकार की बात की. मैं आपको याद दिला दूँ की अहंकार की पराकाष्ठा तो उस दिन हुई थी जिस दिन राहुल जी ने अपने ही प्रधान मंत्री डाक्टर मनमोहन सिंह जी का अपमान करते हुए राष्ट्रपति द्वारा जारी अध्यादेश को फाड़ कर फेंका था. कौन किसको सुना रहा है ?
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) May 7, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.