Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ పోయిందా? డూప్లికేట్ కార్డ్ ఇలా పొందొచ్చు

Duplicate Voter ID card Process | ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. మీ ఓటర్ ఐడీ కార్డు పోతే డూప్లికేట్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 29, 2019, 2:59 PM IST
Election 2019: ఓటర్ ఐడీ కార్డ్ పోయిందా? డూప్లికేట్ కార్డ్ ఇలా పొందొచ్చు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 29, 2019, 2:59 PM IST
దేశమంతా ఎన్నికల సందడి నెలకొంది. నాయకులు, ఓటర్లు ఎన్నికల నామస్మరణ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మీ దగ్గర ఓటర్ ఐడీ కార్డు ఉందా? ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఇతర డాక్యుమెంట్లు చూపించి ఓటు వేయొచ్చు. లేదా డూప్లికేట్ ఓటర్ ఐడీకార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎలక్టోరల్ ఆఫీసర్‌కు అవసరమైన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. మీ ఓటర్ ఐడీ కార్డు పోతే డూప్లికేట్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.

ఆన్‌సైన్‌లో డూప్లికేట్ ఓటర్ ఐడీకి దరఖాస్తు చేయండి ఇలా


మీరు నివసించే రాష్ట్రానికి చెందిన ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో Form EPIC-002 డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఫామ్ పూర్తిగా నింపి, అడ్రస్‌ ప్రూఫ్, ఎఫ్ఐఆర్ కాపీ లాంటి కావాల్సిన డాక్యుమెంట్లు జతచేయాలి.
స్థానిక ఎన్నికల అధికారికి సబ్మిట్ చేస్తే మీకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది.
రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా మీ అప్లికేషన్‌ను ట్రాక్ చేయొచ్చు.


మీరు ఒకసారి ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎన్నికల కార్యాలయం వెరిఫై చేస్తుంది.
Loading...
వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీకు సమాచారం అందుతుంది.
స్థానిక ఎన్నికల కార్యాలయానికి వెళ్లి డూప్లికేట్ ఓటర్ ఐడీ కార్డు తెచ్చుకోవాలి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ

DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000

SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...