Home /News /national /

EKNATH SHINDE TAKES OATH AS CM DEVENDRA FADNAVIS AS HIS DEPUTY NEW GOVT HOLDS FIRST CABINET MEETING PVN

Eknath Shinde : మహారాష్ట్ర సీఎంగా షిండే,డిప్యూటీగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం

సీఎం షిండే,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

సీఎం షిండే,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

Eknath Shinde Takes Oath as CM : శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Eknath Shinde Takes Oath as CM : శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) మహారాష్ట్ర కొత్త సీఎంగా(Maharashtra CM) ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్ భవన్ లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమలో షిండే చేత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ప్రమాణస్వీకారం చేశారు.  మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశాన్ని(Cabinet Meeting) నిర్వహించారు. మహారాష్ట్ర క్యాబినెట్ 2 రోజుల పాటు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలవాలని కేబినెట్ నిర్ణయించింది: జూలై 2, 3 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సెషన్ మొదటి రోజు, స్పీకర్ ఎన్నికలు పూర్తవుతాయి. నానా పటోలే రాజీనామా తర్వాత స్పీకర్ పదవి ఖాళీగా ఉంది.

భారీ ట్విస్టులు, నాటకీయ పరిణామాల మధ్య సీఎం సీటుని పదవిని దక్కించుకున్నారు షిండే. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన.. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇవ్వాలని ఇవాళ మధ్యాహ్నాం గవర్నర్ ని కోరడానికి వెళ్లే ముందు కూడా షిండే సీఎం అవుతారని ఎవరూ ఊహించలేదు. గవర్నర్ ని కలిసిన తర్వాత అనూహ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా షిండేని ఎంపిక చేసినట్లు ఫడణవీస్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడ్నవీస్ ప్రకటించగా.. బీజేపీ హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

ISRO ఖాతాలో మరో విజయం..PSLV C53 ప్రయోగం విజయవంతం

అంత‌కుముందు ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స్పందిస్తూ.. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామి కావాల‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యించిందన్నారు. త‌మ వ్య‌క్తిగ‌త అభ్య‌ర్థ‌న మేరకు ఫ‌డ్న‌వీస్.. డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌డ‌తారని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Devendra Fadnavis, Eknath Shinde, Maharashtra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు