హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Shrikant Shinde: తండ్రి లేనప్పుడు కొడుకుదే రాజ్యం.. సీఎం సీటులో ఆయన కుమారుడు.. ఫొటోలు వైరల్

Shrikant Shinde: తండ్రి లేనప్పుడు కొడుకుదే రాజ్యం.. సీఎం సీటులో ఆయన కుమారుడు.. ఫొటోలు వైరల్

సీఎం కుర్చీలో శ్రీకాంత్ షిండే

సీఎం కుర్చీలో శ్రీకాంత్ షిండే

Srikant Shinde: మహారాష్ట్ర సీఎం కుర్చీలో ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే కూర్చున్న ఫొటోను పోస్ట్ చేసి.. శివసేన-బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  సచివాలయంలో సీఎం కుర్చీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కూర్చుంటారు. అంతే తప్ప ఎవరు పడితే వారు కూర్చోవడానికి వీల్లేదు. కానీ మహారాష్ట్ర (Maharashtra)లో మాత్రం సీఎం కుర్చీలో ఆయన కుమారుడు కూర్చున్నాడని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై మరాఠా రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అధికార కార్యక్రమాల కోసం ఆయన హస్తినలో పర్యటిస్తున్నారు. ఐతే ఆదే సమయంలో శరద్ పవార్ పార్టీ NCP నాయకుడు రవికాంత్ పర్పే ట్వీట్ చేసిన ఓ ఫొటో.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరదీసింది. మహారాష్ట్ర సీఎం కుర్చీలో ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే (Srikant Shinde) కూర్చున్న ఫొటోను పోస్ట్ చేసి.. శివసేన-బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

  ''సూపర్ సీఎం అయినందుకు శ్రీకాంత్ షిండేకు శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి లేని సమయంలో ఆయన కుమారుడు ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కే పని జరుగుతోంది. ఇది ఎలాంటి రాజధర్మం''. అని ఎన్సీపీ నేత రవికాంత్ పర్పే ట్వీట్ చేశారు.

  ఆ ఫొటో నిజమైనదేనా? కాదా అనే దానిపై స్పష్టత లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే.. సీఎం కుర్చీపై కూర్చుని పనిచేస్తున్నట్లు ఫొటోలో కనిపిస్తోంది. ఆయన ఏదో ఫైల్‌ను చూస్తున్నారు. చుట్టూ అధికారులు కూడా నిలబడి ఉన్నారు. ఆయన వెనకాల ముఖ్యమంత్రి అని కూడా రాసి ఉంది.

  శ్రీకాంత్ షిండేను సూపర్ సీఎం అంటూ ఎన్సీపీ నేతలు సెటర్లు వేస్తున్నారు. ఎన్సీపీ నేత మెహబూబ్ షేక్ కూడా ఈ ఫొటోను షేర్ చేశారు. ''సీఎం లేకపోవడంతో ఆయన కుమారుడు సీఎం పదవిని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి పరువును తీసే పనిలో తండ్రికొడుకులు ఉన్నారు. ఇది ఏ రాజధర్మం? తండ్రి ఏక్ నెంబర్.. కొడుకు దస్ నెంబర్. మహారాష్ట్ర కర్మ'' అని ట్వీట్ చేశారు.

  ఈ ఫొటోపై రాజకీయ దుమారం చెలరేగడంతో..ఎట్టలకే ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఎన్సీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఎదురుదాడి చేశారు. ఎన్సీపీ నేతలు వైరల్ చేస్తున్న ఫొటోలో ఉన్న ఆఫీసు.. సీఎం కార్యాలయం కాదని అన్నారు. అది తన ఇల్లు అని స్పష్టం చేశారు.  అది సీఎం కుర్చీ కాదని..తన కుర్చీ అని చెప్పుకొచ్చారు. కుర్చీ వెనుక సీఎం అని రాసి ఉన్న బోర్డు తాను గమనించలేదని.. ఇది సాధారణమైన విషయమని పేర్కొన్నారు. దీనిపై ఇంతగా రచ్చ చేయాల్సిన అవరం లేదని  ఆయన విమర్శించారు. కాగా, శ్రీకాంత్ షిండే కుమారుడు.. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Eknath Shinde, Maharashtra, Mumbai, Shiv Sena

  ఉత్తమ కథలు