పీఓకె ఉగ్ర స్థావరాలపై దాడుల్లో 18మంది ఉగ్రవాదుల మృతి..

భారత సైన్యం జరిపిన పిన్ పాయింట్ ఫిరంగి కాల్పుల్లో జైషే మహమ్మద్,ఇతర జిహాదీ స్థావరాల టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: October 23, 2019, 7:52 AM IST
పీఓకె ఉగ్ర స్థావరాలపై దాడుల్లో 18మంది ఉగ్రవాదుల మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాకిస్తాన్ ఆక్రమితి కశ్మీర్(పీఓకె)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఆదివారం ప్రతిదాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మొత్తం 18మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది.ఇందులో 16మంది పాకిస్తాన్ జవాన్లు ఉన్నట్టు సమాచారం. అయితే దాడుల్లో ఎంతమంది చనిపోయారన్న దానిపై భారత ఆర్మీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భారత సైన్యం జరిపిన పిన్ పాయింట్ ఫిరంగి కాల్పుల్లో జైషే మహమ్మద్,ఇతర జిహాదీ స్థావరాల టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పీఓకె ఉగ్ర స్థావరాలపై దాడులకు సంబంధించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదివారం రెండుసార్లు సమాచారం అందించారు. అయితే సాధారణ పౌరులకు ఏమీ కాకుండా.. కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరపాలని రాజ్‌నాథ్ సూచించినట్టు తెలుస్తోంది.

ఆదివారం ఉదయం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తంగ్‌ధర్ సెక్టార్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. పాక్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది.పాక్ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసేందుకు భారత సైన్యం ఫిరంగులను ఉపయోగించింది. పీఓకెలోని నీలమ్ లోయలో ఉన్న మొత్తం నాలుగు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. కాగా, 60మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని ఇటీవల ఇంటలిజెన్స్ వర్గాలు భారత సైన్యానికి సమాచారం అందించాయి. మరో 500మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకొ చొరబడేందుకు ఎదురుచూస్తున్నారనిబతెలిపాయి. ఈ సమాచారం అందిన కొన్ని వారాలకే నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు విరమణ ఉల్లంఘనకుబపాల్పడటం గమనార్హం. దీంతో పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగిన భారత్.. పీఓకెలోని ఉగ్ర స్థావరాలు,లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది. నీలమ్ వ్యాలీలోని నాలుగు లాంచ్ ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. జురా,అతముఖ,కుందాల్‌షాహిల్లోని లాంచ్ ప్యాడ్లను కూడా ధ్వంసం చేసింది.

First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>