Home /News /national /

EIGHT YEARS TO THE NDA GOVERNMENT THE BEST EIGHT SCHEMES LAUNCHED BY THE NARENDRA MODI GOVERNMENT SINCE 2014 KNOW HERE GH VB

Narendra Modi@8: ఎన్డీఏ ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు.. మోదీ ప్రారంభించిన ఎనిమిది ముఖ్య పథకాలు ఇవే..

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

గత ఎనిమిదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా సమాజంలోని అన్ని వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలను విజయవంతంగా అందించింది.

దేశంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం(Government) ఏర్పడి మే 26 నాటికి ఎనిమిదేళ్లు అవుతుంది. అధికారంలో ఉన్నంత కాలం దేశ అభివృద్ధి(Development), సామాజిక న్యాయం, సామాజిక భద్రతకు తాము కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలిపారు. గత వారం బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. “ఈ నెలలో NDA ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.’’ అని చెప్పారు. గత ఎనిమిదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా సమాజంలోని అన్ని వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలను విజయవంతంగా అందించింది. 2014 నుంచి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం ప్రారంభించిన ఇలాంటి ఎనిమిది ప్రధాన పథకాలను News18.com మీ ముందుకు తీసుకువస్తోంది.

ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat)
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 సెప్టెంబరులో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రాయోజిత ఆరోగ్య సంరక్షణ పథకంగా ఈ స్కీమ్‌కు గుర్తింపు ఉంది. 10.74 కోట్ల కంటే ఎక్కువ పేద, బలహీన కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణ అందించాలనేది ఈ పథకం లక్ష్యం. PM-JAY లబ్ధిదారుల్లో 40% మంది అత్యంత వెనుకబడిన వర్గాల వారే ఉన్నారు.

ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు సమకూరుస్తుండగా.. పథకం అమలు ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్, ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు నుంచి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులను కవర్ చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన మూడో వార్షికోత్సవం సందర్భంగా, గత సంవత్సరం PM మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను కూడా ప్రారంభించారు. దీని కింద హెల్త్ రికార్డ్స్ ఉన్న వ్యక్తులకు డిజిటల్ హెల్త్ IDలను అందించాలని నిర్ణయించారు.

MonkeyPox : మహమ్మారిలా మంకీపాక్స్ -గాలి ద్వారా వ్యాప్తి? -క్వారంటైన్ విధిస్తూ బెల్జియం సంచలనం


ఉజ్వల యోజన (Ujjwala Yojana)
ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పేరుతో ఉచిత LPG కనెక్షన్ ఇవ్వడం ఈ స్కీమ్ లక్ష్యం. ఇంధన రిటైలర్‌లకు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా కొన్ని లక్షల కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్‌లను అందించారు. దీంతో 80 మిలియన్ల మంది భారతీయ మహిళలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 5 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

SC, ST కమ్యూనిటీలు అటవీ ప్రాంతాల్లో ఉండేవారు వంటి మరో ఏడు వర్గాలకు చెందిన మహిళా లబ్ధిదారులను ఈ స్కీమ్ లబ్ధిదారులుగా చేరుస్తూ 2018 ఏప్రిల్‌లో పథకాన్ని విస్తరించారు. లక్ష్యాన్ని ఎనిమిది కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్‌లకు పొడిగించారు. షెడ్యూల్ కంటే ఏడు నెలల ముందుగానే.. 2019 ఆగస్టులో ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంది.

జన్ ధన్ యోజన (Jan Dhan Yojana)
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఒక ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్. 2014 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్‌ను ప్రకటించారు. తక్కువ ధరలో ఆర్థిక సేవలను లబ్ధిదారులకు అందించడం ఈ పథకం లక్ష్యం. ఇప్పుడు స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు, పెన్షన్‌, కోవిడ్ రిలీఫ్ ఫండ్‌ వంటి ప్రయోజనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జన్ ధన్ ఖాతాలతో సహా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 9 నాటికి జన్ ధన్ పథకం కింద తెరిచిన బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటాయి. ఆర్థిక శాఖ డేటా ప్రకారం, 2021 డిసెంబర్ చివరి నాటికి 44.23 కోట్లకు పైగా PMJDY ఖాతాల్లో మొత్తం బ్యాలెన్స్ రూ.1,50,939.36 కోట్లుగా ఉంది.

డేటా ప్రకారం, మొత్తం 44.23 కోట్ల ఖాతాల్లో రూ.34.9 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, రూ.8.05 కోట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో, మిగిలిన రూ.1.28 కోట్లు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. గ్రామీణ, సెమీ అర్బన్ బ్యాంకు శాఖలలో 29.54 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. డిసెంబర్ 29, 2021 నాటికి దాదాపు 24.61 కోట్ల మంది ఖాతాదారులు మహిళలు ఉన్నారు. పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 17.90 కోట్ల PMJDY అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. 2021 డిసెంబర్ 8 నాటికి, జీరో బ్యాలెన్స్ ఖాతాల మొత్తం సంఖ్య 3.65 కోట్లు. ఇది మొత్తం జన్ ధన్ ఖాతాలలో 8.3% అని ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది.

కిసాన్ సమ్మాన్ నిధి (Kisan Samman Nidhi)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద, అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తోంది. రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో ఈ మొత్తం చెల్లింస్తుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు జమ అవుతుంది. ఈ ఏడాది జనవరి 1న ఈ పథకం కింద 10వ విడత ఆర్థిక సహాయంగా భారతదేశం అంతటా 10.09 కోట్ల మందికి పైగా రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.20,900 కోట్లకు పైగా విడుదల చేశారు. తాజా విడతతో కలిపి ఈ పథకం కింద అందించిన మొత్తం దాదాపు రూ.1.8 లక్షల కోట్లకు చేరుకుంది. PM-KISAN పథకాన్ని 2019 ఫిబ్రవరి బడ్జెట్‌లో ప్రకటించారు. మొదటి విడత నిధులను 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు విడుదల చేశారు.

PM Kisan | PM SYM : రైతులకు మరో శుభవార్త.. ప్రతినెలా రూ.3000 పెన్షన్..పీఎం కిసాన్ ద్వారా ఇలా..

బీమా, పెన్షన్
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలను 2015లో ప్రారంభించారు. దేశంలో బీమా పరిధిని పెంపొందించడం.. పేదలకు, అణగారిన వర్గాల వారికి బీమా రక్షణ అందించడం ఈ పథకం లక్ష్యం. PMJJBY స్కీమ్ లబ్ధిదారులకు రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీని అందిస్తోంది. అయితే PMSBY మాత్రం.. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైతే రూ. 2 లక్షల కవరేజీని.. శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష కవరేజీని అందిస్తుంది. 2021 అక్టోబర్ 27 నాటికి PMJJBY, PMSBY కింద వరుసగా రూ. 10,258 కోట్ల విలువైన 5,12,915 క్లెయిమ్‌లు, రూ. 1,797 కోట్ల మొత్తంతో 92,266 క్లెయిమ్స్ పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటుకు తెలిపింది.

ఇదే సమయంలో అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని ఎంచుకున్న వారికి.. పెన్షన్ మొత్తం ఆధారంగా 60 సంవత్సరాల వయస్సులో రూ. 1,000 నుంచి రూ. 5,000 హామీతో కూడిన కనీస నెలవారీ పెన్షన్‌ను అందిస్తారు. ఈ స్కీమ్ 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే ఖాతాదారులకు అందుబాటులో ఉంటుంది. స్కీమ్ కాంట్రిబ్యూషన్ నెలకు రూ. 42 నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా చందాదారుడు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి నెలవారీ పెన్షన్ లభిస్తుంది. చందాదారుడు, వారి జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో నామినీకి రూ. 8.5 లక్షల వరకు కార్పస్ మొత్తం లభిస్తుంది.

అందరికీ ఇళ్లు (Housing for All)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 జూన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2022 నాటికి అందరికీ ఇళ్లు అందించాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. 2022 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. PMAY కింద, వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. గ్రామీణ, పట్టణాలలో 80 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి రూ. 48,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. 2022-23లో.. పీఎం ఆవాస్ యోజనలో గుర్తింపు పొందిన అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కానుందని, ఇందుకోసం రూ. 48,000 కోట్లు కేటాయించామని ఆమె చెప్పారు.

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ తేదీ ఇదే


స్వచ్ఛ భారత్ (Swachh Bharat)
2014లో ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా బహిరంగ మలవిసర్జనను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ మిషన్ కింద ప్రభుత్వం 11.5 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించింది. 2022-23 బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కోసం రూ. 7,192 కోట్లు కేటాయించగా, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కోసం 2021-2026లో రూ. 1,41,678 కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చాలని, అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మలవిసర్జన రహితంగా.. 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చాలనేది స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశ లక్ష్యం.

గత ఏడాది అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ పథకం రెండో దశను ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన పారిశుద్ధ్యంపై దృష్టి సాధించడమే లక్ష్యంగా పథకం విజయవంతంగా అమలవుతోంది. ఘన వ్యర్థాల విభజన, 3R s (రెడ్యూస్- తగ్గింపు, రీ యూజ్- పునర్వినియోగం, రీసైకిల్) సూత్రాలను ఉపయోగించడం, అన్ని రకాల మున్సిపల్ ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ కోసం డంప్‌సైట్‌ల నివారణపై మిషన్ దృష్టి సారిస్తుంది.

ముద్రా యోజన (Mudra Yojana)
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) అనేది చిన్న పారిశ్రామికవేత్తలకు రూ. 10 లక్షల వరకు రుణాలు అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం. బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి), మైక్రోఫైనాన్స్ సంస్థలు ముద్రా రుణాలు ఇస్తున్నాయి. పరిశ్రమలు, అగ్రిగేటర్లు, ఫ్రాంఛైజర్‌లు, అసోసియేషన్‌లకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ పథకం కింద 34.42 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు రూ. 18.60 లక్షల కోట్ల రుణాన్ని పొందారని.. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 68 శాతానికి పైగా రుణ ఖాతాలు మహిళలకు మంజూరయ్యాయని, పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎలాంటి రుణం పొందని కొత్త పారిశ్రామికవేత్తలకు 22 శాతం రుణాలు మంజూరు చేశామని ఆమె తెలిపారు.
Published by:Veera Babu
First published:

Tags: Central governmennt, Narendra modi, PM KISAN, PM Kisan Scheme, Pm modi, Pmjdy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు